కోహ్లి కాప్టెన్ గా రిసైన్? ధోని తిరిగి కాప్టెన్?

ఇటీవ‌లే లండ‌న్‌లో జ‌రిగిన ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీ త‌రువాత భార‌త క్రికెట్‌లో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గ‌త కొద్ది రోజులుగా కోచ్ కుంబ్లేకు, కెప్టెన్ కోహ్లికి మ‌ధ్య స‌త్సంబంధాలు లేవ‌ని మొద‌ట తెలిసింది. ఈ క్ర‌మంలోనే కొత్త కోచ్ కోసం బీసీసీఐ అన్వేషించ‌సాగింది. ఇక ట్రోఫీ ముగియగానే తాజాగా కుంబ్లే కోచ్ ప‌ద‌వికి రాజీనామా చేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. దీంతో కోహ్లి వ్య‌వ‌హ‌రించిన తీరుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అంత‌టి సీనియ‌ర్ ఆట‌గాన్ని లెక్క చేయ‌కుండా కోహ్లి ఇష్టం వ‌చ్చిన‌ట్టు ప్ర‌వ‌ర్తించ‌డం, అందుకు బోర్డు పెద్ద‌లు వ‌త్తాసు ప‌ల‌కం క్రికెట్ అభిమానుల‌కే న‌చ్చ‌డం లేదు. దీంతో చాలా మంది ఇప్పుడు కోహ్లిని విమ‌ర్శిస్తున్నారు. అయితే తాజాగా మ‌రో సంచ‌ల‌న విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అదేమిటంటే…

ప్రస్తుత భారత జట్టులో డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌గా విరాట్‌ కోహ్లికి ఘనమైన చరిత్ర ఉంది. సెంచరీల మీద సెంచరీలు చేయడమే కాదు అనేక మ్యాచ్ ల్లో భారత్‌ను గెలిపించిన ఘనత అతనిది. మూడు ఫార్మెట్లలోనూ సారథిగా బాధ్యతలు చేపట్టి జట్టుకు విజయాలను అందిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే జట్టు ప్రతిష్టను పెంచాడు. కానీ కుంబ్లే తో ఉన్న వివాదం వల్ల…కుంబ్లే కోచ్ గా ఉంటే కాప్టెన్ పదవికి రాజీనామా చేస్తా అని కోహ్లి అన్నట్టు సమాచారం. బహుశా అందుకే కుంబ్లే తప్పుకున్నడనుకుంట

ప్రస్తుతం భారత్ క్రికెట్ లో చోటు చేసుకున్న సంక్షోభానికి ముగింపు పలకాలంటే తిరిగి ధోనిని జాతీయ జట్టుకు కెప్టెన్ గా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. ఆన్ ఫీల్డ్ లోనే కాకుండా ఆఫ్ ఫీల్డ్ లో సైతం హుందాగా ఉండే ధోనినే సారథిగా కరెక్ట్ అంటూ పలువురు క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

https://twitter.com/borahnium/status/877707470793187328

Comments

comments

Share this post

scroll to top