“ధోని” కి తృటిలో తప్పిన అగ్ని ప్రమాదం!

భారత క్రికెట్ జట్టు మాజీ సారధి “మహేంద్ర సింగ్ ధోని” తృటిలో పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నారు. ఢిల్లీ లోని “ద్వారకా” అనే హోటల్ లో హటాత్తున మంటలు చెలరేగిన ప్రమాదంలో “ధోని” సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కేవలం ఆష్టి నష్టం మాత్రమే జరిగింది. వివరాలు మీరే చూడండి!


భారత జట్టు సారధ్యాన్ని వదిలేసిన తరవాత “మహేంద్ర సింగ్ ధోని” దేశవాళీ క్రికెట్ అయిన “విజయ్ హజారే ట్రోఫీ” లో తన సొంత ఊరు అయిన “ఝార్ఖండ్” జట్టు తరుపున ఆడుతున్నారు. కేవలం వికెట్ కీపర్ బ్యాట్స్ మాన్ గా మాత్రమే కాకుండా మొదటి సరిగా “ఝార్ఖండ్” జట్టుకి సారధ్యం కూడా వహిస్తున్నాడు. జట్టుని విజయం రథం పై తీసుకెళ్తున్నాడు ధోని!


మార్చ్ 17 న “ఢిల్లీ” లో “బెంగాల్” జట్టుతో సెమి ఫైనల్ మ్యాచ్ ఉండగా. మొదట మ్యాచ్ ఆలసయంగా మొదలవుతుంది అన్నారు, తరవాత మ్యాచ్ శనివారం కి వాయిదా పడింది అధికారికంగా ప్రకటించారు. ఫిరోజ్ షా కోట్ల స్టేడియం లో శనివారం ఈ మ్యాచ్ జరగనుంది.
ఇది ఇలా ఉండగా “ఝార్ఖండ్” జట్టు సభ్యులందరు “ఢిల్లీ” లోని “ద్వారకా” హోటల్ లో బస చేస్తుండగా ఉదయం ఏడు గంటల సమయంలో రూమ్ లో పొగలు రావడం వారు గమనించారు. వెంటనే అందరు అప్రమత్తం అయ్యి బయటకి పరుగులు తీశారు. అంత పెద్ద హోటల్ లో ఫైర్ అలారమ్ లేకపోవడం గమనర్హం.


వెంటనే హోటల్ యాజమాన్యం ఫైర్ స్టేషన్ కి సమాచారం అందించగా. ఫైర్ రెస్కు టీం తొందరగా అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేసారు. ఈ ప్రమాదం లో ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ జట్టు సభ్యుల సామాన్లు, క్రికెట్ కిట్లు అన్ని అగ్ని లో ధ్వంసం అయ్యాయి!
ఏదేమైనా “ధోని” జట్టు పెద్ద ప్రమాదం నుండే బయటపడ్డారు. ఇకనైనా అలంటి హోటల్ జాగ్రత్తలు తీసుకొని ఫైర్ అలారంలు పెట్టిస్తే బాగుండు!

 

Comments

comments

Share this post

scroll to top