మరోసారి వికెట్ చూడకుండా వెనకనుండి బాల్ విసిరి రన్ అవుట్ చేసిన “ధోని”..చూస్తే ఫ్యాన్ అవ్వాల్సిందే..!

భారత మాజీ సారధి “ధోని” గత కొన్ని రోజులుగా ఎన్నో విమర్శలపాలవుతున్నారు అని అందరికి తెలిసిందే. కానీ హైదరాబాద్ తో ఆడిన ఐపీఎల్ మ్యాచ్ లో సంచలన బాటింగ్ తో అభిమానులందరినీ ఆకట్టుకున్నారు. ఏప్రిల్ 26 న “కోల్కత్త – పూణే” మ్యాచ్ లో వచ్చిరాగానే బౌండరీలు కొట్టి ప్రత్యర్థులను భయపెట్టాడు. కానీ అంతలోనే అవుట్ అయిపోయాడు. పూణే మ్యాచ్ ఓడిపోయినప్పటికీ “ధోని” చేసిన రన్ అవుట్ మాత్రం సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటుంది.

వికెట్ కీపింగ్ లో భారత కీపర్ “ధోని” కి ఉన్న రికార్డ్స్ ఏంటో అందరికి తెలిసిందే. వికెట్ చూడకుండా కూడా వెనకనుండి కరెక్ట్ గా వికెట్ ను కొట్టి రన్ అవుట్ చేయగల సమర్ధుడు. అది ఇంతకుముందే నిరూపించాడు. నిన్న జరిగిన మ్యాచ్ లో మరోసారి నిరూపించారు మహేంద్ర సింగ్ ధోని. “నరైన్” ని ఎలా రన్ అవుట్ చేసాడో వీడియో చూడండి!

Watch Video Here:

Comments

comments

Share this post

scroll to top