100 మీటర్ల రన్నింగ్‌ రేస్‌లో పాల్గొన్న ధోనీ, పాండ్యా.. ఎవరు గెలిచారో తెలుసా..?

శ్రీలంకతో ధర్మశాలలో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో భారత్‌ ఘోర ఓటమి పాలైందనే విషయం అందరికీ తెలిసిందే. దీంతో రెండో వన్డేలో కసిగా ఆడారు. ఫలితంగా భారత్‌ మొదటి వన్డే ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. శ్రీలంకపై రెండో వన్డేలో ఘన విజయం సాధించింది. అయితే రెండో వన్డే పక్కన పెడితే మొదటి వన్డేలో భారత ఆటగాళ్లందరూ విఫలమయ్యారు. అయినప్పటికీ మాజీ కెప్టెన్‌ ధోనీ ఒక్కడే నిలకడగా ఆడాడు. మొత్తం 87 బంతులు ఆడిన ధోనీ 65 రన్స్‌ చేశాడు. అతనిలో ఉన్న ఫిట్‌నెస్‌కి ఇది నిదర్శనమని చెప్పవచ్చు. అయితే కేవలం ఆటలోనే కాదు, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పరంగా కూడా ధోనీ మిగిలిన ప్లేయర్స్‌ కన్నా బెస్ట్‌ అని చెప్పవచ్చు. ఎందుకంటే..

ఈ మధ్యే మొహాలీలో జరిగిన వన్డేకు ముందు మ్యాచ్‌ ఆరంభ సమయంలో ధోనీ, హార్దిక్‌ పాండ్యాలు ఇద్దరూ 100 మీటర్ల రన్నింగ్‌ రేస్‌ ను మైదానంలో నిర్వహించారు. అయితే అందులో ఎవరు గెలిచారో తెలుసా..? ఆ.. ఏముందీ.. ధోనీ వయస్సు అయిపోయింది, పాండ్యా కుర్రాడు, కనుక పాండ్యాయే గెలిచి ఉంటాడు.. అని అనుకుంటున్నారా..? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఆ 100 మీటర్ల రేస్‌లో గెలిచించి పాండ్యా కాదు, ధోనీ. అవును, మీరు విన్నది నిజమే. కావాలంటే కింద ఇచ్చిన వీడియోను చూడవచ్చు. అందులో ధోనీ ఎలా వేగంగా పరిగెత్తాడో మీకే తెలుస్తుంది. కనుక ఇప్పటికైనా ఒప్పుకుంటారా..? ధోనీకి బాగా ఫిట్‌నెస్‌ ఉందని.

అయితే ధోనీ, పాండ్యా రేసుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. దీంతో ఆ వీడియో బాగా వైరల్‌ అయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు నెటిజన్లు పెద్ద ఎత్తున ధోనీని ప్రశంసిస్తున్నారు. 36 సంవత్సరాల వయస్సులోనూ ధోనీ బాగా ఫిట్‌గా ఉన్నాడు, పాండ్యాకు 24 అయినా, ఇద్దరికీ 12 సంవత్సరాల వయస్సు తేడా ఉన్నా ధోనీయే యంగ్‌గా ఉన్నాడు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొందరైతే.. ధోనీ ఇండియన్‌ టీమ్‌కు పిల్లర్‌ అని, అతనో సూపర్‌ హ్యూమన్‌ అని, ధోనీకి రన్నింగ్‌ కాంపిటీషన్‌ వచ్చేది కేవలం ఉస్సేన్‌ బోల్ట్‌ మాత్రమే అని, లెజెండ్‌ ఎప్పటికైనా లెజెండ్‌ అని, ఫిట్‌నెస్‌కు ఏజ్‌ ఏమాత్రం అడ్డుకాదని, ధోనీ ఫిట్‌నెస్‌కు ప్రతిరూపం అని… ఇలా రక రకాలుగా ట్వీట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా రిటైర్మెంట్‌ వయస్సు దగ్గర పడుతున్నా ధోనీ ఇంకా ఇంత ఫిట్‌గా ఉండడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే కదా..!

Comments

comments

Share this post

scroll to top