“రాంచి” మ్యాచ్ లో ప్రేక్షకుడిగా “ధోని”… స్టేడియం లో “ధోని” ని చూసిన అభిమానుల ఆనందోత్సాహాలు చూడండి!

మొదటి టెస్ట్ లో టీం ఇండియా భారీ ఓటమి రుచి చూసింది. రెండో టెస్ట్ మ్యాచ్ లో అనూహ్య విజయం సాధించింది. “రాంచి” లో మూడవ చివరి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. మొదట టాస్ గెలిచి బాటింగ్ చేస్తున్న “ఆస్ట్రేలియా” రెండవ రోజు 451 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యింది. భారత్ 603 భారీ స్కోరు చేసింది మొదటి ఇన్నింగ్స్ లో. మన బౌలర్లు కూడా బాగా విజృంభిస్తున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. అయితే “రాంచి” అనగానే మనకి గుర్తొచ్చేది “ఝార్ఖండ్ డైనమైట్” మాజీ సారధి “మహేంద్ర సింగ్ ధోని”.

ధోని అంటే రాంచీ… రాంచీ అంటే ధోని… ఆ నగరానికి అతను తెచ్చి పెట్టిన పేరు అలాంటిది.  నాలుగేళ్ల క్రితం ఇక్కడ తొలి వన్డే జరిగినప్పుడు ధోని ఆటపాటలతో సంబరాల్లో పాలుపంచుకున్నాడు. అయితే ఇప్పుడు రాంచీకి టెస్టు హోదా వచ్చిన తర్వాత మ్యాచ్‌ జరుగుతున్న సమయానికి అతను టెస్టులకే దూరమయ్యాడు.

అయితే 26వ టెస్టు వేదికైన రాంచీలో జరుగుతున్న తొలి మ్యాచ్ లో ధోని ప్రేక్షకుడిగా హాజరయ్యాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో భాగంగా చివరి రోజు ఆటలో వీఐపీల గ్యాలరీలో కూర్చొని మ్యాచ్ ను వీక్షించాడు. విజయ్ హజారే వన్డే టోర్నీలో జార్ఖండ్ జట్టు సెమీస్ లో ఓటమి పాలుకావడంతో టెస్టు మ్యాచ్ ను వీక్షించే అవకాశం ధోని దక్కింది. ఈ క్రమంలోనే రాంచీలో ఆటగాడిగా కాకుండా, ప్రేక్షక్షుడిగా అభిమానుల్ని ధోని అలరించాడు. తన పక్కనున్న సహచరులతో ముచ్చటిస్తూ ధోని కనువిందు చేశాడు.

ధోని ని చూసిన సంతోషంలో అభిమానుల కేరింతల హోరు అయితే అంబరాన్ని అంటే స్థాయిలో ఉన్నాయి. కామెంటేటర్ కూడా “ధోని” టీ తాగుతుంటే “మసాలా చాయ్” అని సరదాగా అన్నారు! ఆ వీడియో మీరే చూడండి!

Watch Video Here:

Comments

comments

Share this post

scroll to top