నిన్నటి మ్యాచ్ కి ముందు..సెహ్వాగ్ తో పాటు ఆ ఇద్దరు హెలికాప్టర్ షాట్ ఆడబోయారు.! చివరికి ఏమైంది?

క్రికెట్‌కు టీమిండియా మిస్టర్ కూల్ ఎమ్మెస్ ధోనీ పరిచయం చేసిన షాట్.. హెలికాప్టర్ షాట్. హెలికాప్టర్‌లాగే బ్యాట్‌ను గుండ్రంగా తిప్పుతూ బంతిని స్టాండ్స్‌లోకి పంపడం చూసి మొదట్లో అందరూ ఆశ్చర్యపోయారు. అసలు ఇదేం వింత షాట్ అనుకున్నారు. చాలా మంది ట్రై చేసినా.. ఇప్పటికీ ఆ షాట్ ఆడటం ఎవరికీ సాధ్యం కాలేదు. ధోనీ కూడా ఈ మధ్య ఆ షాట్‌ను చాలా అరుదుగా ఆడుతున్నాడు. అయితే మొన్న ఆస్ట్రేలియాతో రాంచీలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ ముగిసిన తర్వాత కామెంటేటర్లంతా ధోనీ హెలికాప్టర్ షాట్ చాలెంజ్‌కు సై అన్నారు. ఇందులో ఇండియన్ మాజీ ప్లేయర్స్ వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్‌తోపాటు ఆస్ట్రేలియా మాజీలు డీన్ జోన్స్, బ్రెట్ లీ ఈ చాలెంజ్‌ను స్వీకరించారు. నలుగురూ ధోనీ షాట్ ఆడటానికి ట్రై చేసినా.. వీరూ మాత్రం కాస్త బెటర్ అనిపించాడు. ఈ వీడియోను స్టార్ స్పోర్ట్స్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

watch video here:

Comments

comments

Share this post

scroll to top