ధోని గ్రేట్ నెస్ పై 40 సెకండ్ల వీడియో. ఇది చూశాక ధోనిని ఆకాశానికెత్తకుండా ఉండలేరు.!

వికెట్ వెనుక ధోని ఎంత వేగంగా కదులుతాడో తెలిపే వీడియో ఇది,ఈ వీడియో చూశాక ఖచ్చితంగా ధోనీ మీదున్న గౌరవం రెట్టింపవుతుంది. పాదరసానికి పర్యాయపదంలా ఫీల్డ్ మీద కనిపించే ధోనికి సృష్టిలో వేగంగా జరిగిపోయే మరికొన్ని వస్తువులకు పోలికను చూస్తే వాటి కంటే కూడా ధోనీ కదలికలు వేగంగా ఉంటాయని చెప్పేదే ఈ వీడియో.  వికెట్ల వెనకున్న ధోని స్టంపింగ్ కోసం ఎంతలా కాచుకొని ఉంటాడో, బాల్ చేతికందగానే వికెట్లను ఎలా గిరాటేస్తాడు చూపిస్తూ వాటినే ఇతర వస్తువులతో పోల్చుతూ వాహ్ వా అనిపించారు. ఈ వీడియో ను రూపొందించిన వారు…

మెరుపు కంటే వేగంగా, మూత తీయడం కంటే వేగంగా, చెంప దెబ్బ కొట్టడం కంటే వేగంగా…. అతడి కదలిక .కంటిరెప్ప మూసి తెరిసే లోపుగా, ఫ్యాంట్ జిప్ పెట్టుకునే లోపలా, సిగరెట్ వెలిగించే కన్నా తక్కువ టైమ్ లోనే…. అతడు పనిని ముంగిచేస్తాడు. చిటికె వేసే లోపే, అటు నుండి ఇటు ఫేస్ టర్నింగ్ ఇచ్చే లోపే, సైకిల్ బెల్ మోగించే లోపే మ్యాటర్ ఫినిష్ చేసేస్తాడు. ట్రిగ్గర్ నొక్కే టైమ్ లోనే, పక్షి ఓ అడుగు తీసి అడుగేసే లోపే, బుల్లెట్ ఓ వస్తువు నుండి దూసుకుపోయే వేగంతో పోల్చితే వాటికంటే కూడా ముందుగానే రియాక్ట్ అవుతాడు….వీడియో చూస్తే  కలిగే ఆ ఫీలే వేరు.. ఓ సారి ట్రై చేయండి.

dhoni

Watch Video:  Click

 

Comments

comments

Share this post

scroll to top