“బాహుబలి” ఇంటర్వెల్ సీన్ నిన్నటి మ్యాచ్ లో రిపీట్..”ధోని” వస్తుంటే ఆడియన్స్ ఏం చేసారంటే.! [VIDEO]

బాహుబలి ఇంటర్వెల్ సీన్ గుర్తుంది కదా..? భల్లాలదేవుడు వచ్చినప్పుడు ఎవరు పట్టించుకోరు..అదే బాహుబలి రాగానే జనమంతా బాహుబలి బాహుబలి అని అరుపుల హోరు సృష్టిస్తారు. ఇలాంటి పరిస్థితే నిన్నటి భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ లో చోటు చేసుకుంది. 64 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది భారత్. రోహిత్ అవుట్ అయిన బాధ కంటే ధోని వస్తున్నాడు అనే సంతోషం ఆడియన్స్ లో ఎక్కువ కనిపించింది. ధోని వల్లే చెన్నై స్టేడియం టిక్కెట్లు గంటలోనే అమ్ముడుపోయాయి. ధోని గ్రౌండ్ లోకి వస్తుంటే మాహి మాహి అని స్వగతం పలికారు ఆడియన్స్. అభిమానుల నమ్మకాన్ని ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ తో నిలబెట్టాడు మహి.

ఇండియన్ ప్రీమియిర్ లీగ్ (ఐపీఎల్‌)లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఇదే చెపాక్ స్టేడియంలో ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్ ఆడిన ధోని, చాలా రోజుల తర్వాత ఇక్కడికి రావడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ‘ద కింగ్ రిటర్న్స్ టు చెన్నై’ అంటూ రాసుకొచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

watch video here:

అంతే కాకుండా వంద అర్ధ సెంచరీలు సాధించిన భారత ఆటగాల్లో లిస్ట్ లో ధోని చేరిపోయాడు. చివరి వరకు పోరాడి పాండ్య తో కలిసి ఓ మంచి స్కోర్ సాధించిపెట్టాడు ధోని. బౌలర్ల కృషి కూడా తోడవ్వడంతో విజయం భారత్ సొంతమైంది

Comments

comments

Share this post

scroll to top