“డాడీ వాటర్ తాగు” అని నీళ్లు తాగించింది ధోని కూతురు..! దానికి ముందు “ధోని” ఏం చేసారో తెలుసా.? [VIDEO]

బాలీవుడ్ స్టార్స్‌, భారత క్రికెటర్ల మధ్య ఆదివారం రాత్రి జరిగిన చారిటీ ఫుట్‌‌బాల్ మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం అభిమానుల్ని అమితంగా ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌ ఆరంభంలోనే మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఫ్రీ కిక్‌తో గోల్ కొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. జట్టులోని సహచర క్రికెటర్లు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న వేళ.. ధోనీ మాత్రం మ్యాచ్‌ని ఎంజాయ్ చేస్తూ 39వ నిమిషంలో రెండోసారి ఫుట్‌బాల్‌లో తన ప్రావీణ్యాన్ని చాటుకుంటూ గోల్ కొట్టేశాడు. దీంతో కోహ్లి టీమ్ 2-0తో ప్రథమార్థంలోనే ఆధిపత్యం దిశగా దూసుకెళ్లింది.

మ్యాచ్ విరామ సమయంలో అలసిపోయి వస్తున్న ధోనీని చూసిన అతని గారాలపట్టి జీవా వాటర్ బాటిల్‌ని తీసుకుని మైదానంలోకి రావడంతో ధోనీ ఫిదా అయిపోయాడు. అక్కడే మోకాళ్లపై కూర్చుని జీవా చేతుల మీదుగా కొన్ని నీళ్లు తాగి.. ప్రేమతో హత్తుకున్నాడు. ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో కోహ్లి టీమ్ 7-3 తేడాతో ఘన విజయం సాధించింది.

watch video here:

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా తన గారాల పట్టి.. కూతురు జీవాతో గడుపుతాడనే విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ నెల 22న ప్రారంభమయ్యే న్యూజిలాండ్‌ వన్డే సిరీస్‌కు సమయం ఉండటంతో దొరికిన ఈ ఖాళీ సమయాన్ని కుటుంబ సభ్యులతో సరదాగా ఆస్వాదిస్తున్నాడు. తన గారాల పట్టీ చిలిపి చేష్టలను ఎప్పటికప్పుడూ సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకునే ధోని.. తాజాగా పోస్టు చేసిన ఓ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఇంతకీ ఆ వీడియో ఏంటంటే.. ధోని తనకూతురు జీవాతో లడ్డు కోసం పోటీ పడ్డాడు. చివరికి ఈ పోటీలో గెలుపు జీవానే వరించగా.. ఈ వీడియోని ధోని మురిపంగా ‘అటాక్‌ ఆన్‌ బెసన్‌ లడ్డు’ అంటూ ఇన్‌స్ట్రాగమ్‌లో పోస్టు చేశాడు. ఇక ఆస్ట్రేలియాతో రాంచీ వేదికగా జరిగిన తొలి టీ20 అనంతరం టీమిండియా ధోని నివాసాన్ని సందర్శించింది. ఆ సమయంలో కెప్టెన్‌ కోహ్లి జీవాతో సరదాగా ముచ్చటించిన వీడియోను సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్న విషయం తెలిసిందే.

A post shared by @mahi7781 on

Comments

comments

Share this post

scroll to top