ధోని…సినిమా రివ్యూ & రేటింగ్.

Cast&crew:

 • నటీనటులు:  సుశాంత్ సింగ్ రాజ్ పుత్, కైరా అద్వానీ, దిశా పాటాని, అనుపమ్ కేర్, భూమిక చావ్లా…
 • దర్వకత్వం: నీరజ్ పాండే
 • మ్యూజిక్: అమాల్ మాలిక్
 • నిర్మాతలు: పరాస్ జైన్, వినీత్ జైన్.

Story:

రాంచీ అనే చిన్న టౌన్ నుండి వచ్చిన కుర్రాడు ఇండియా టీం కెప్టెన్ ఎలా అయ్యాడు అనేది ఈ సినిమా కథ. ఇది చాలా మందికి తెలిసిన కథే. మహి చిన్నప్పుడు ఫుట్ బాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్ లాంటి ఆటల పట్ల శ్రద్ధ చూపుతాడు. రాజేశ్ శర్మ అనే కోచ్ ధోని లోని ప్రతిభను గుర్తిస్తాడు. అతన్ని క్రికెట్ వైపుకు మలుపుతాడు. కాని మహి తండ్రి మాత్రం ధోని జాబ్ చేయాలనుకుంటుంటాడు. ధోని సోదరి(భూమిక చావ్లా), అతని స్నేహితులు మాత్రం ధోని ఎప్పటికైనా అతని గోల్ రీచ్ అవుతాడని నమ్ముతారు. అతనికి సపోర్ట్ చేస్తుంటారు. ధోని క్రికెట్ టీంలో చేరడానికి  ప్రయత్నించి ఓడిపోయినప్పటికి పట్టు వదలకుండా  ప్రయత్నించి టీమ్ లో చోటు సంపాదిస్తాడు. ఇక ఆ పై జరిగేదంతా మనకు తెలిసిన కథే.

విశ్లేషణ: అయితే ఫస్టాఫ్ ను బాగా చిత్రీకరించిన దర్శకుడు సెకండ్ హాఫ్ మాత్రం బోరింగ్ గా చేశాడు. దిశా పటాని ధోని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా నటించింది. కైరా అద్వాని ధోని భార్య సాక్షి పాత్రలో నటించింది. వీరిద్దరూ క్యారెక్టర్స్ కు న్యాయం చేశారు. యువరాజ్ పాత్ర కథలో ఉన్నప్పటికి చిన్ని చిన్న సీన్లకే పరిమితమయ్యింది. ప్రేక్షకులు ధోని క్రికెట్ లైఫ్ లో జరిగిన వివాదాలకు సంబంధించిన కథను చెబుతారనుకున్నారు. కాని అలాంటి సీన్లు ఏమి లేవు. కనీసం కెప్టెన్ గా ధోని డ్రెస్సింగ్ రూంలో ఎలా ప్లేయర్లను మోటివేట్ చేసేవాడు, అతని బిహేవియర్ ఎలా ఉంటుందనేది కూడా చూపించలేదు. మొత్తానికి ధోని క్రికెటర్ అవకముందు ఏంటి అనేది మాత్రమే సినిమాలో వివరంగా చెప్పారు.

plus:

 • ఫస్టాఫ్.
 • బయోపిక్స్ మీద మనకుండే ఇంట్రస్ట్.
 • ధోనీని దించేసిన సుశాంత్

minus:

 • సెకండ్ హాఫ్ బోరింగ్,
 • బ్యాక్ గ్రౌండ్ స్కోర్,
 • ఎడిటింగ్
 • స్క్రీన్ ప్లే.

Rating:2.5/5

Verdict: ధోని అన్ టోల్డ్ స్టోరీ అంటే సినిమాలో కూడా కొన్ని విషయాలు అన్ టోల్డ్ అని అర్థం.

Trailer:

Comments

comments

Share this post

scroll to top