చెన్నై సూపర్ కింగ్స్ కు ఓనర్ కానున్న ధోని?

కెప్టెన్ గా సేవలందించిన జట్టుకే  ఓనర్ కానున్నాడట ధోని… మ్యాచ్ ఫిక్సింగ్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ , రాజస్థాన్ రాయల్స్ జట్లను రెండు సంవత్సరాల పాటు నిషేధించడంతో… చెన్నైకు కెప్టెన్ గా ఉన్న మహేంద్రసింగ్ ధోని కి మంచి అవకాశం దొరికినట్టైంది. కెప్టెన్ గా ఉన్న టీమ్ కు ఓనర్ అయ్యే అవకాశం దక్కింది.

జస్టిస్ లోథా  ధర్మాసనం ఆ జట్ల  ఫిక్సింగ్ మీద తీర్పు ఇస్తూ  చెన్నై సూపర్ కింగ్స్ , రాజస్థాన్ రాయల్స్  రెండు టీమ్ లను నిషేదిస్తూ ఒక ఆప్షన్ కూడా ఇచ్చింది. యాజమాన్యాలు మారితే చెన్నై, రాజస్థాన్ జట్లు ఐపియల్ లో పాల్గొనవచ్చు అనింది. సో దీన్ని బేస్ చేసుకొని చాలా మంది చెన్నై టీమ్ ను చేజిక్కించుకోవాలని చూశారు.

csk

కానీ..తెర వెనుక , టీమ్ ను చేజిక్కించునేందుకు ధోని పావులను గట్టగానే కదుపుతున్నాడట.. ఐపియల్ స్టార్ట్ అయిన 2008  నుండి చెన్నై జట్టును  సారథిగా నడిపించింది తానే,  రెండు సార్లు టైటిల్ ను కూడా అందింది నా కెప్టెన్సీలోనే, అలాంటి తనకు ఈ టీమ్ ను కొనసాగించే బాధ్యత ఉందని సన్నిహితుల దగ్గర కూడా చెప్పాడంట ధోని.

నిన్నా మొన్నటి వరకు  అత్యధిక సంపాధన ఆర్జిస్తున్న ఆటగాళ్ల లో  ధోని ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. దానికి తోడు ధోని అడగాలే కానీ కాదనకుండా సహాయం చేసే వాళ్ళు చాలా మందే ఉన్నారు. అంతకంటే ఎక్కువగా జట్టు సభ్యులైన రవీంద్ర జడేజా, అశ్విన్, రైనా లు సైన్యంలాగా ధోనికి సపోర్ట్ చేస్తుంటారు. వీటన్నింటి చూస్తే చెన్నై టీమ్ కు ధోని ఓనర్ కావడమే తరువాయి అనిపిస్తోంది.

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top