స్టంప్స్ మైక్ లో రికార్డ్ అయిన “ధోని” మాటలు వింటే సాహో అనాల్సిందే..మొన్నటి మ్యాచ్ గెలవటానికి కారణం ఇదే!

64 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది భారత్. రోహిత్ అవుట్ అయిన బాధ కంటే ధోని వస్తున్నాడు అనే సంతోషం ఆడియన్స్ లో ఎక్కువ కనిపించింది. ధోని వల్లే చెన్నై స్టేడియం టిక్కెట్లు గంటలోనే అమ్ముడుపోయాయి. ధోని గ్రౌండ్ లోకి వస్తుంటే మాహి మాహి అని స్వాగతం పలికారు ఆడియన్స్. అభిమానుల నమ్మకాన్ని ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ తో నిలబెట్టాడు మహి. ఈ మిస్టర్ కూల్.. కేవలం బ్యాట్‌‌తోనే సత్తా చాటుతాడనుకుంటే పొరపాటే. వికెట్ల వెనక ధోనీ ఎంతటి విలువైన ఆటగాడో మనందరికీ తెలుసు.

ఆస్ట్రేలియా పతనంలో ఇద్దరు  బౌలర్లు కుల్దీప్, చాహల్ ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ప్రమాదకర ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌, మార్కస్‌ స్టొయినిస్‌ను కుల్‌దీప్‌ పెవిలియన్‌కు పంపించగా.. భారీ సిక్సర్లు, బౌండరీలతో చెలరేగిన మాక్స్‌వెల్‌, మాథ్యూ వేడ్‌, కమిన్స్‌ను చాహల్‌ ఔట్‌ చేశాడు. ఈ ఇద్దరు స్పిన్నర్లకూ వికెట్ల వెనక నుంచి ధోనీ విలువైన సలహాలిచ్చాడు. మహీ ఇచ్చిన సూచనలు స్టంప్స్‌ మైక్‌లో రికార్డయ్యాయి.

“‘వో మార్నే వాలా దాల్‌నా.. అందర్‌ యా బాహర్‌ కోయీ భీ (షాట్‌ కొట్టే బాల్ వేయి.. వికెట్ల వైపు లేదా బయటకి టర్న్‌ అయినా సరే), ఘూమ్నే వాలా దాల్‌ ఘూమ్నే వాలా దాల్‌.. (టర్న్‌ అయ్యే బాల్ వెయ్యి)’ అని కుల్‌దీప్‌కు ధోనీ సూచించాడు. సిక్సర్లు బాదుతున్న మాక్స్‌వెల్‌ను ఔట్‌ చేయడానికి స్పిన్నర్లిద్దరికీ నేరుగా స్టంప్స్‌ పైకి బాల్ వేయొద్దని (స్టంప్‌ పే మత్‌ దాల్‌) మహీ సూచించాడు.

తాను అనుకున్న రీతిలో కుల్‌దీప్ బాల్ వేయకపోవడంతో.. ‘అరే బాహర్‌ దాల్‌, ఇస్కో ఇత్నా ఆగే నహీ (స్టంప్స్‌కు దూరంగా బాల్ వేయి.. అతడి ముందు వేయకు)’ అని ధోనీ చెప్పాడు. చాహల్‌ కూడా అదే మూస పద్ధతిలో బౌలింగ్ చేస్తుండటంతో.. ధోనీ కాస్త పెద్ద గొంతు చేసుకొని ‘ఐసే ఐసే దాలో, తు భీ సున్తా నహీ హై క్యా (నువ్వు కూడా చెప్పింది వినిపించుకోవా.. ఇలా అలా వెయ్యి)’ అంటూ గట్టిగా చెప్పాడు.”

 

 

Comments

comments

Share this post

scroll to top