ఎప్పుడు కూల్ గా ఉండే “ధోని” మనీష్ పై ఎలా ఫైర్ అయ్యాడో తెలుసా.? అసలేమైందంటే..?

Krishna

ఎప్పుడూ ఫీల్డ్‌లో కూల్‌గా ఉండే మన ఎంఎస్‌ ధోనికి కోపమొచ్చింది. ఎంతలా అంటే సహచర ఆటగాడు మనీష్‌ పాండేపై గట్టిగా అరచి మందలించేంతగా. ‘ ఓయ్‌ ఇటు చూడు.. అటెటో కాదు’ అంటూ మనీష్‌పై ధోని ఆగ్రహం వ్యక్తం చేశాడు. సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న క్రమంలో ఇది చోటు చేసుకుంది. భారత ఇన్నింగ్స్‌లో భాగంగా 19వ ఓవర్‌లో మనీష్‌పై తీవ్రంగా మండిపడ్డాడు. ఆ సమయానికి ధోని స్ట్రైకింగ్‌లో ఉండగా, పాండే నాన్-స్ట్రైకర్‌ ఎండ్‌లో నిలుచున్నాడు.

అప్పటికే వీరిద్దరూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ఒకవైపు బౌండరీలు బాదుతూనే ధోని తనదైన స్టైల్‌లో వేగంగా రెండేసి పరుగులను పూర్తి చేస్తున్నాడు.అయితే 19వ ఓవర్ జరుగుతున్నప్పుడు నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న పాండే ఎటో చూస్తున్నాడు. అంతే ధోనికి చిర్రెత్తుకొచ్చింది. ‘ఓయ్ కిదర్ దేక్ రా హై. ఉదర్ కా దేక్ రా హై. అవాజ్ నహీ జాయేగి, ఇషారా దేకియో’ అని గట్టిగా అరుస్తూ చెప్పాడు. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో హల్‌చల్‌ చేస్తోంది.

watch video here:

Angry msd 😃😃

A post shared by Sumit (@7sumit7) on

Comments

comments