అమ్రపాలి అంటే మన కలెక్టర్ గారు అనుకుంటే మీరు పొరబడినట్టే..ఆమ్రపాలి అనేది ఒక రియల్ ఎస్టేట్ సంస్థ..ఈ సంస్థకు మహేంద్రసింగ్ ధోనీ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సదరుఅమ్రపాలి గ్రూప్, తనకు రూ.150 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని ఆరోపిస్తూ న్యాయపోరాటానికి దిగారు మన మాజీ కెప్టెన్ ధోనీ.భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అతనితో పాటుగా భారత క్రికెటర్లు కేఎల్ రాహుల్, భువనేశ్వర్ కుమార్ అమ్రపాలిపై ఫిర్యాదు చేశారు.
బ్రాండు అంబాసిడర్గా ఉన్న తనకు ఇప్పటి వరకు ఎలాంటి చెల్లింపులు చేయలేదని ధోని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేవలం ధోని మాత్రమే కాక, కేఎల్ రాహుల్, భువనేశ్వర్ కుమార్, దక్షిణాఫ్రికాకు చెందిన క్రికెటర్ ఫ్రాంకోయిస్ డు ప్లెస్సీలు కూడా అమ్రపాలిపై ఢిల్లీ హైకోర్టులో రికవరీ దావా వేశారు. ఈ విషయంపై స్పందించడానికి అమ్రపాలి గ్రూప్ అధికార ప్రతినిధి నిరాకరించారు. సదరు సంస్థ 2016 సంవత్సరంలో 2011 ప్రపంచ కప్ గెలిచనందుకు గాను జట్టులోని ప్రతి క్రికెటర్ కు రూ.9కోట్ల విలువైన విల్లాను బహుమతిగా ఇస్తామని ప్రకటన జారీ చేసింది. దీనికి సంబంధించి ధోనీకి, ఇతర క్రికెటర్లకు 1690 చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన స్థలాన్ని ఇచ్చింది.