ధనలక్ష్మీ తలుపు తడితే… రివ్యూ & రేటింగ్స్

ధనలక్ష్మీ తలుపు తడితే:

Dhanalakshmi-talupu-tadete-posters-7

 

ధన్ రాజ్, సింధుతులానీ, శ్రీముఖి  ప్రధాన పాత్రల్లో  నటించిన ధనలక్ష్మీ తలుపు తడితే చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  సాయి అచ్యుత్ చిన్నారి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం సస్పెన్స్ కు సస్పెన్స్ ను .. కామెడీకి కామెడీని పంచింది. అనుకోకుండా కోటి రూపాయలు దొరికిన ఫ్రెండ్స్ కు  ఎదురైన  ఇబ్బందులను… వాళ్ళు  పంచిన హాస్యాన్ని క్రమంగా తెరకెక్కించాడు దర్శకుడు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాగబాబు  కూడా నటించారు.

STORY:

ప్రోఫేషనల్ కిడ్నాపర్స్ అయిన  రణధీర్(రణధీర్), శ్రీముఖి కలిసి  ఎంపి  వసుంధర(సింధు తులాని) మేనల్లుడిని కిడ్నాప్ చేసి కోటి రూపాయలు ఇమ్మని డిమాండ్ చేస్తారు. వసుంధర దానికి ఒప్పుకొని కోటి ఇవ్వడానికి సిద్దమవుతుంది. డీల్ ప్రకారం రణధీర్ బాబుని ఇచ్చేసి కోటి తీసుకోవడానికి వెళుతుండగా యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ తర్వాత ఆ బాబు  తనీష్(తనీష్) బర్త్ డే పార్టీ కోసం చిన్ననాటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అయిన కోడి(ధనరాజ్), పండు(మనోజ్ నందం), చిట్టి(అనిల్ కళ్యాణ్), విజయ్ సాయి(సత్తి) లకు కనిపిస్తాడు.

అతను ఎవరి బాబు అని వెతుకుతుండగా ఆ ప్లేస్ కి వచ్చిన  వసుంధర   వారికి కోటి ఇచ్చి బాబుని తీసుకెళ్ళిపోతుంది. కానీ ఆ డబ్బు వచ్చిన కొద్దిసేపటికే వారి జీవితాలు మారిపోతాయి.  ఫ్రెండ్స్ అందరూ విడిపోవడం, ఆదివాసీల చేతికి చిక్కడం చకా చకా జరిగిపోతాయి. ఆ కోటి రూపాయలు వీరికి  తెచ్చిపెట్టిన సమస్యలేంటో తెర  మీద చూడాల్సిందే..

 Plus:

  • ధనరాజ్  నటన.
  • సస్పెన్స్ ను  ,కామెడీని బాలెన్స్ చేసిన విధానం.
  • భోలే షా వలి  మ్యూజిక్.

Minus.

  • మధ్యలో కాస్త బోరింగ్
  • అనవసర సన్నివేశాలు.

Rating: 2.5/5

Movie In One Line : వెండితెర జబర్థస్త్.

ఇవి కేవలం మా అభిప్రాయాలు మాత్రమే.

CLICK:  పాండవుల్లో ఒకడు రివ్యూ& రేటింగ్

CLICK:  మంత్ర రివ్యూ & రేటింగ్

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top