DGP గా రిటైర్డ్ అయ్యారు…ఫ్రీగా గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్లో పిల్ల‌ల‌కు పాఠాలు చెబుతున్నారు.!

ఉద్యోగం నుండి రిటైర్డ్ అయిన త‌ర్వాత‌ ఎవ‌రైనా ఏం చేస్తారు.? మ‌న‌వ‌ళ్ళ‌తో ఆడుకోవ‌డం, ప్ర‌శాంతంగా రోజు గ‌డ‌ప‌డం లాంటివి చేస్తుంటారు. కానీ 34 ఏళ్ళ పాటు స‌ర్వీస్ చేసి DGP గా రిటైర్డ్ అయిన త‌ర్వాత ముఖేష్ స‌హాయ్ అనే ఈ పోలీస్ ఆఫీస‌ర్ మాత్రం స్కూల్ టీచ‌ర్ గా మారాడు..అది కూడా రూపాయి తీసుకోకుండా గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్ పిల్ల‌ల‌కు ఫ్రీగా మ్యాథ‌మెటిక్స్, ఫిజిక్స్ స‌బ్జెక్ట్స్ ను బోధిస్తున్నారు.

అస్సాం కు చెందిన ముఖేష్ స‌హాయ్.. ఏప్రిల్ 30, 2018 ను అస్సాం DGP ప‌ద‌వి నుండి రిటైర్డ్ అయ్యారు. ఆ త‌ర్వాత త‌న ఇంటికి ద‌గ్గ‌ర్లో ఉన్న సోనారామ్ హైయ్య‌ర్ సెకండ‌రీ స్కూల్ లో మ్యాథ్స్ టీచ‌ర్ గా జాయిన్ అయ్యారు. తాను ప‌ద‌విలో ఉన్న‌ప్పుడు చాలా పాఠ‌శాల‌ల‌కు చీఫ్ గెస్ట్ గా వెళ్ళేవారు ముఖేష్..ఈ క్ర‌మంలో చాలా స్కూల్స్ లో మ్యాథ్స్ టీచ‌ర్ కొర‌త‌ను ఆయ‌న గ‌మ‌నించారు, దీని కార‌ణం చేత ఆయ‌న ప‌ద‌వీ విర‌మ‌ణ పొందాక‌…గ‌ణిత ఉపాధ్యాయుడిగా ఉచిత సేవ‌లందిస్తున్నారు. స‌బ్జెక్ట్ తో పాటు త‌న‌కు అనుభ‌వ‌మున్న పోలీస్ రంగం గురించి, అటువైపుగా వెళ్ళాలంటే ఏం చేయాలి? ఎలా చేయాలి..? అనే విష‌యాల ప‌ట్ల కూడా విద్యార్థుల‌కు శిక్ష‌ణనిస్తున్నారు ముషేష్‌.

పిల్ల‌లు కూడా ముఖేష్ స‌హాయ్ ని ముద్దుగా DGP టీచ‌ర్ అని పిలుచుకుంటున్నారు. !!

Comments

comments

Share this post

scroll to top