పోలీసులు ఫిర్యాదును ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అత‌ను డీజీపీలా ట్విట్ట‌ర్‌లో ఆదేశాలిచ్చాడు. చివ‌ర‌కు ఏమైందో తెలుసా..?

సాధార‌ణంగా మ‌న స‌మాజంలో ఎవ‌రికైనా అన్యాయం జ‌రిగినా లేదంటే ఎవ‌రైనా మోస‌పోయినా, ఇత‌ర నేరాలు ఏవైనా జ‌రిగినా బాధితులు మొద‌ట ఏం చేస్తారు ? ఎక్క‌డైనా.. నేరం జ‌రిగితే ముందుగా బాధితులు పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి పోలీసుల‌కే క‌దా ఫిర్యాదు చేసేది..! దీంతో పోలీసులు బాధితుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టి బాధితుల‌కు న్యాయం జ‌రిగేలా చూస్తారు. ఇది ఎక్క‌డైనా జ‌రిగేదే. కానీ కొన్ని సంద‌ర్భాల్లో మాత్రం పోలీసులు నిర్లక్ష్యం వ‌హిస్తుంటారు. బాధితులు ఫిర్యాదు చేసినా, త‌మ‌కు న్యాయం చేయాల‌ని ఎన్ని సార్లు పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లినా పోలీసులు ప‌ట్టించుకోరు. దీంతో బాధితుల‌కు ఏం చేయాలో అర్థం కాదు. అయితే ఇలాంటి స్థితినే ఓ యువ‌కుడు ఎదుర్కొన్నాడు. ఈ క్ర‌మంలో అత‌ని త‌మ్ముడు మాత్రం ఓ వినూత్న‌మైన ప్ర‌యోగం చేశాడు. దీంతో అన్న స‌మ‌స్య‌ను అత‌ను సాల్వ్ చేశాడు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే…

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని గోర‌ఖ్‌పూర్ జిల్లాకు చెందిన ఓ యువ‌కుడు మ‌హారాజ్ గంజ్‌కు చెందిన సాదిక్ అన్సారీ అనే వ్య‌క్తికి రూ.45వేలు ఇచ్చాడు. దీంతో సాదిక్ ఆ యువ‌కుడికి దుబాయ్‌లో జాబ్ ఇప్పిస్తాన‌ని ప్రామిస్ చేశాడు. త‌రువాత అత‌ను ప‌ట్టించుకోలేదు. దీంతో ఆ యువ‌కుడు మోస‌పోయాన‌ని గ్ర‌హించి సాదిక్‌పై స్థానిక పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ఎన్నో సార్లు పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి త‌న గోడును పోలీసుల ఎదుట వెళ్ల‌బోసుకున్నాడు. అయిన‌ప్ప‌టికీ పోలీసులు ప‌ట్టించుకోలేదు.

పోలీసులు అలా ప‌ట్టించుకోక‌పోయేస‌రికి ఆ యువ‌కుడి త‌మ్ముడు 10 త‌ర‌గ‌తి చ‌దువుతున్న ఓ బాలుడు ఓ వింత ప‌నిచేశాడు. యూపీ డీజీపీ ఓం ప్ర‌కాష్ సింగ్ పేరిట ఓ న‌కిలీ ట్విట్ట‌ర్ ఖాతా ఓపెన్ చేసి డీజీపీలా న‌టిస్తూ ట్విట్ట‌ర్‌లో కింది స్థాయి పోలీసుల‌కు ఆదేశాలు జారీ చేశాడు. స‌ద‌రు కేసును వెంట‌నే సాల్వ్ చేయండి.. ప్లీజ్ టేక్ యాక్ష‌న్‌.. అంటూ ట్విట్ట‌ర్‌లో పోలీసుల‌కు ఆదేశం ఇచ్చాడు. దీంతో పోలీసులు నిజంగానే డీజీపీ ఆదేశించార‌నుకుని చ‌క చ‌కా ఆ కేసును సాల్వ్ చేశారు. ఈ క్ర‌మంలో స‌ద‌రు సాదిక్ ఆ యువ‌కుడికి రూ.30వేలు ఇచ్చేశాడు. మిగిలిన మొత్తం త్వ‌ర‌లోనే స‌ర్దుబాటు చేస్తాన‌ని చెప్పాడు. అయితే పోలీసుల‌కు మాత్రం షాక్ త‌గిలింది. ఎందుకంటే అస‌లు ఆ ట్విట్ట‌ర్ అకౌంట్ త‌మ డీజీపీది కాదు. ఆ విష‌యం వారికి త‌రువాత తెలిసింది. దీంతో ఆ అకౌంట్‌ను ఎవ‌రు క్రియేట్ చేశారో సైబ‌ర్ సెల్ ద్వారా ట్రేస్ చేసి ఆ బాలున్ని ప‌ట్టుకున్నారు. అత‌ను బాధిత యువ‌కుడి త‌మ్ముడ‌ని నిర్దారించారు. ఆ యువ‌కుడి ఫిర్యాదును పోలీసులు ప‌ట్టించుకోక‌పోయేస‌రికి అత‌ని త‌మ్ముడు త‌న ఫ్రెండ్ స‌ల‌హా మేర‌కు అలా యూపీ డీజీపీ న‌కిలీ ట్విట్ట‌ర్ ఖాతాను ఓపెన్ చేసి ఆ ప‌నిచేశాడు. దీంతో దెబ్బ‌కు వారి స‌మ‌స్య ప‌రిష్కార‌మైంద‌ని పోలీసులు తెలుసుకున్నారు. అయితే అలా చేసినందుకు పోలీసులు మాత్రం ఆ బాలున్ని, అత‌ని ఫ్రెండ్‌ను వ‌దిలేశారు. ఎందుకంటే.. వారు చేసిన ప‌ని వ‌ల్ల మంచే జ‌రిగిన‌ప్ప‌టికీ నిజానికి అలా చేయ‌డం చ‌ట్ట‌రీత్యా నేరం. క‌నుక స్కూల్‌కు పోయే విద్యార్థుల భ‌విష్య‌త్తు నాశ‌న‌మ‌వుతుంద‌ని భావించిన పోలీసులు వారిని విడిచిపెట్టారు. మ‌రెప్పుడూ ఇలాంటి ప‌ని చేయ‌కూడ‌ద‌ని గ‌ట్టిగా హెచ్చ‌రించారు. అవును మ‌రి.. పోలీసులు స‌రిగ్గా ప‌నిచేస్తే.. జ‌నాల‌కు ఇలాంటి ప్ర‌యోగాలు చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు క‌దా. ఏది ఏమైనా ఆ బాలుడు చేసింది కరెక్టే క‌దా.. ఏమంటారు..?

Comments

comments

Share this post

scroll to top