ఆ గ్రామంలో మగవారు ఆడవారిలాగా మేకప్ వేసుకుంటారు.! కారణం తెలుస్తే షాక్ అవుతారు..!

దెయ్యం.. ఈ మాట చెబితే కొంద‌రు భ‌య‌ప‌డిపోతారు. రాత్రి గానీ ప‌గ‌లు కానీ దెయ్యాల గురించిన మాటలు ఏం మాట్లాడినా కొంద‌రు వ‌ణికిపోతారు. ఇక దెయ్యాలు పట్టుకండా కొంద‌రు పూజ‌లు అవి చేస్తే కొంద‌రు తాయెత్తులు క‌ట్టుకుంటారు. మ‌న దేశంలో ఇలా చేస్తారు. ఇక విదేశాల్లోనూ దెయ్యాలు అంటే హ‌డ‌లైపోయి వాటి బారి నుంచి తప్పించుకునేందుకు వింత వింత ప‌నులు చేస్తుంటారు. ఇప్పుడు మేం చెప్ప‌బోయేది కూడా స‌రిగ్గా ఈ విష‌యం గురించే. ఆ ప్రాంతంలో ఓ విధ‌వ అయిన దెయ్యం (లేదా ఆమె ఆత్మ అనుకోండి) అక్క‌డి జ‌నాల‌ను భ‌య‌పెడుతోంది. అదీ ముఖ్యంగా ఆ గ్రామంలో ఉండే మ‌గ‌వారిని. దీంతో వారు దెయ్యం బారిన ప‌డ‌కుండా ఉండేందుకు ఏం చేస్తున్నారో తెలుసా..?

 

థాయ్‌లాండ్‌లోని నాఖొన్ ఫాన‌మ్ అనే గ్రామంలో ఉన్న ప్ర‌జ‌లు దెయ్యం పేరు చెబితే ఆమ‌డ దూరం పారిపోతున్నారు. ముఖ్యంగా మ‌గ‌వారు అయితే జ‌డిసి ప్యాంట్ల‌లో సుసు పోసుకుంటున్నారు. ఎందుకంటే ఈ మ‌ధ్యే ఆరోగ్య‌వంతంగా ఉన్న 5 మంది మ‌గ‌వారు రోజుకొక‌రు చొప్పున రాత్రి పూట నిద్ర‌లో ప‌డుకున్న వారు ప‌డుకున్న‌ట్టుగానే చ‌నిపోయార‌ట‌. రాత్రి బాగానే ప‌డుకున్నా తెల్లారి లేచి చూసే స‌రికి చ‌నిపోయి ఉన్నార‌ట‌. దీంతో ఆ గ్రామంలో దెయ్యాలు ఉన్నాయని, ఇది వాటి ప‌నే అని అనుకుంటున్నారు.

 

నాఖొన్ ఫాన‌మ్ గ్రామంలో తిరుగుతున్న ఓ విధ‌వ‌రాలి ఆత్మ దెయ్య‌మై ఆరోగ్య‌వంతమైన మ‌గ‌వారిని చంపుతుంద‌నే పుకారు చెల‌రేగింది. తాజాగా ఎలాంటి అనారోగ్యం బారిన ప‌డ‌కున్నా స‌ద‌రు మ‌గ‌వారు 5 మంది హ‌ఠాత్తుగా అలా నిద్ర‌పోవ‌డంతో ఈ న‌మ్మ‌కం ఆ గ్రామ‌స్తుల్లో బ‌ల‌ప‌డింది. దీంతో వారు దెయ్యం బారిన ప‌డ‌కుండా ఉండేందుకు వింత వింత ప‌నులు చేస్తున్నారు. కొంద‌రు త‌మ ఇంటి గోడ‌ల‌పై ఓ స్త్రీ రేపు రా మాదిరిగా, ఇక్క‌డ పురుషులెవ‌రూ లేరు అని రాసుకున్నారు. కొంద‌రు మ‌నుషుల‌ను పోలిన దిష్టి బొమ్మ‌ల‌ను (పెద్ద అంగాలు బ‌య‌ట‌కు క‌నిపించేలా) తయారు చేసి ఇండ్ల వ‌ద్ద పెట్టుకుంటున్నారు. ఇక మ‌రికొంద‌రు పురుషులు అయితే రాత్ర‌య్యాక త‌మ మ‌హిళ‌ల దుస్తుల‌ను ధ‌రించి, మేక‌ప్ వేసుకుని మ‌రీ ఆడ‌వారి గెట‌ప్ లోకి మారిపోతున్నారు. అయితే ఈ ప‌నులు చేసిన‌ప్ప‌టి నుంచి దెయ్యం త‌మ ఊర్లో లేద‌ని, ప‌క్క ఊరికి వెళ్లింద‌ని, త‌మ గ్రామంలో ఎవ‌రూ చ‌నిపోవ‌డం లేద‌ని కొంద‌రు చెబుతున్నారు. దీంతో నెట్‌లో ఇప్పుడీ వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఏది ఏమైనా.. ఈ రోజుల్లో కూడా దెయ్యాలు, భూతాలు అంటే.. ఏమో మ‌న‌కెందుకులే.. లేవ‌న్నా, ఉంటాయ‌న్నా ఎవ‌రి న‌మ్మ‌కం వారిది క‌దా..!

Comments

comments

Share this post

scroll to top