యువ‌తికి దెయ్యం ప‌ట్టింద‌ని చెప్పి ఆ మంత్ర‌గాడు ఆమెను ఏం చేసాడో చూస్తే షాక్ అవుతారు..! కుటుంబసభ్యులు కూడా..!

మ‌నుషుల‌కు దెయ్యాలు ప‌ట్టాయ‌ని చెప్పి వాటిని వ‌ద‌ల‌గొట్టేందుకు మ‌న దేశంలో కొన్నిప్రాంతాల్లో ర‌క ర‌కాల ప‌ద్ధ‌తులు పాటిస్తారు. కొన్ని చోట్ల ముగ్గు వేసి అందులో కూర్చోబెట్టి మంత్రాలు చ‌దువుతూ దెయ్యాల‌ను వ‌ద‌ల‌గొట్టే య‌త్నం చేస్తారు. ఇక మ‌రికొన్ని ప్రాంతాల్లోనైతే బాధితుల‌ను చింత లేదా వేప కొమ్మ‌ల‌తో వీపు వాయ‌గొడ‌తారు. అలా చేస్తే ఆ మ‌నుషుల‌కు ప‌ట్టిన దెయ్యాలు వ‌దిలిపోతాయ‌ని న‌మ్ముతారు. అయితే ఆ రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో మాత్రం ఇందుకు కాస్త భిన్నంగా ప్ర‌వ‌ర్తించాడో మోడ్ర‌న్ మంత్ర‌గాడు. దెయ్యం ప‌ట్టింద‌ని చెప్పి ఓ యువ‌తిని అత‌ని వ‌ద్ద‌కు తీసుకువెళ్తే అత‌ను రాక్ష‌సంగా ప్ర‌వర్తిస్తూ ఆ యువ‌తిని చిత్ర హింస‌ల‌కు గురి చేశాడు.

చ‌త్తీస్‌గ‌డ్‌లో నివాసం ఉండే ఓ కుటుంబంలోని ఓ యువ‌తికి దెయ్యం ప‌ట్టింద‌ట‌. అలా అని చెప్పి ఆ కుటుంబ స‌భ్యులే చెబుతూ ఓ మోడ్ర‌న్ మంత్ర‌గాడి వ‌ద్ద‌కు ఆమెను తీసుకెళ్లారు. ఆమె తాను బాగానే ఉన్నాన‌ని ఎంత చెప్పినా ఆమె మాట‌ల‌ను ఆమె కుటుంబ స‌భ్యులు లెక్క చేయ‌లేదు. ఆమెను ఆ మోడ్ర‌న్ మంత్ర‌గాడి వ‌ద్ద‌కు బ‌రా బ‌రా లాక్కెళ్లారు. ఇక అక్క‌డ ఆ యువ‌తికి న‌రకం క‌నిపించింది. స‌ద‌రు మంత్ర‌గాడు ఆమెను నేల‌పై ప‌డేసి కొట్టాడు. ఆమె శరీర భాగాల‌ను ఇష్టం వ‌చ్చిన‌ట్టు తాకుతూ హింసించాడు. బ‌ట్ట‌లు ప‌ట్టుకుని లాగాడు. నేల‌పై ప‌డేసి బ‌రా బ‌రా ఈడ్చాడు. అలా అత‌ను ఆ యువ‌తిని చిత్ర హింస‌ల‌కు గురి చేశాడు.

అయితే స‌ద‌రు మంత్ర‌గాడు అలా చేస్తున్న స‌మ‌యంలో స‌ద‌రు యువ‌తి కుటుంబ స‌భ్యులు అక్క‌డే ఉండి న‌వ్వుకున్నార‌ట‌. నిజంగా రాక్ష‌సులు కాక‌పోతే దెయ్యాలు ఉన్నాయ‌ని న‌మ్మ‌డ‌మే ఒ మూఢ విషయం. పైగా ఇలాంటి అకృత్యానికి పాల్ప‌డిన స‌ద‌రు కుటుంబ స‌భ్యుల‌ను, ఆమెను చిత్ర‌హింస‌లు పెట్టిన ఆ మంత్ర‌గాడిని మ‌నుషులు అనే అంటారా..? నిజంగా రాక్ష‌సులు అనే ప‌దం కూడా వారికి త‌క్కువే అవుతుంది. అయితే ఈ ఘ‌ట‌న ఆ రాష్ట్రంలోని ధంత‌రి జిల్లాలో జ‌రిగింద‌ని కొంద‌రు అంటుండ‌గా, రాయ్‌పూర్ అని మ‌రికొంద‌రు అంటున్నారు. ఈ క్ర‌మంలో ఈ ఘ‌ట‌న‌కు చెందిన ఫొటోలు, వీడియో ఒక‌టి ఇప్పుడు నెట్‌లో వైర‌ల్ అయ్యాయి. ఏది ఏమైనా ఆ యువ‌తి ప‌ట్ల ఇంత‌టి దారుణ చ‌ర్య‌కు ఒడిగ‌ట్ట‌డం క్ష‌మించ‌రాని నేరం. అందుకు వారిని ఏం చేయాలి ? మీరే చెప్పండి..!

Comments

comments

Share this post

scroll to top