శవంతో ముగ్గురు సెక్స్ చేసిన “దేవిశ్రీప్రసాద్” హిట్టా..? అసలు కథేంటి..? రివ్యూ (తెలుగులో) చూసేయండి!

Movie Title (చిత్రం): దేవిశ్రీప్రసాద్ (Devisri prasad)

Cast & Crew:

  • నటీనటులు: పూజా రామ‌చంద్ర‌న్‌, మ‌నోజ్ నందం, భూపాల్‌, ధ‌న్‌రాజ్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, వేణు టిల్లు త‌దిత‌రులు
  • సంగీతం: క‌మ్రాన్‌
  • నిర్మాత: డి.వెంక‌టేష్‌, ఆర్‌.వి.రాజు, ఆక్రోష్
  • దర్శకత్వం: శ్రీ కిషోర్‌

Story:

దేవి(భూపాల్‌) ఆటోన‌డుపుతుంటాడు..శ్రీ హాస్పిట‌ల్‌లో వార్డు బాయ్‌..ప్ర‌సాద్ టీకొట్టుతో జీవితం సాగిస్తుంటాడు. ముగ్గురు మంచి స్నేహితులు. దేవి ఇందులో నెగ‌టివ్ టచ్‌తో ఉంటే, శ్రీ గోడ మీద పిల్లిలాంటి క్యారెక్ట‌ర్ ఉండే వ్య‌క్తి. ప్ర‌సాద్ మాత్రం మంచివాడు. ఈ ముగ్గ‌రుకి హీరోయిన్ లీల అంటే చాలా ఇష్టం. త‌మ ఏరియాలోనే లీల షూటింగ్‌కి వ‌చ్చింద‌ని తెలుసుకున్న ఈ ముగ్గ‌రు, ఆమెను చూడ‌టానికి వెళ్తారు కానీ, దూరం నుండే చూసి వ‌చ్చేస్తారు. కానీ అదే రోజు సాయంత్రానికి లీల ఓ యాక్సిడెంట్‌లో చ‌నిపోయింద‌నే ముగ్గురుకి తెలుస్తుంది. అదీగాక ఆమె శ‌వాన్ని శ్రీ ఉండే హాస్పిట‌ల్‌కే తీసుకొస్తారు. లీల‌ను బ్ర‌తికుండ‌గా ద‌గ్గ‌ర‌గా చూడ‌లేదు కాబ‌ట్టి క‌నీసం చ‌నిపోయిన త‌ర్వాత అయిన ద‌గ్గ‌ర నుండి చూస్తామ‌ని హాస్పిట‌ల్ చేరుకుంటారు. శ్రీ స‌హాయంతో మార్చురీ గ‌దికి వెళ్తారు. లీల శ‌రీరాన్ని చూడ‌గానే దేవికి ఆమెతో సంభోగం చేయాల‌నే కోరిక వ‌స్తుంది. అయితే శ్రీ, ప్ర‌సాద్‌లు వ‌ద్ద‌ని వారించినా దేవి విన‌డు. అప్పుడు ఏం జ‌ర‌గుతుంది? అస‌లు లీల మ‌ర‌ణానికి కార‌ణం ఎవ‌రు? చివ‌ర‌కు క‌థ ఏ మ‌లుపులు తీసుకుంటుంద‌నే విష‌యం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Review:

హాలీవుడ్ సినిమాల్లోని కథాంశంతో ముందుకొచ్చిన సినిమా “దేవిశ్రీప్రసాద్”. ప్రొడక్షన్ వేల్యూస్ బాగుండి, కథనం ఇంకాస్త ఆసక్తికరంగా ఉండి ఉంటే సినిమా రిజెల్ట్ ఇంకాస్త బెటర్ గా ఉండేది. బట్.. కంపల్సరీగా కాకపోయిన ఒకసారి చూడదగ్గ చిత్రం “దేవిశ్రీప్రసాద్”. కమ్రాన్ సంగీతం, ఫణీంద్రవర్మ సినిమాటోగ్రఫీ “దేవిశ్రీప్రసాద్” సినిమాకి మెయిన్ హైలైట్స్. సినిమా మొత్తానికి రెండే పాటలున్నప్పటికీ తన నేపధ్య సంగీతంతో అలరించాడు కమ్రాన్. రెండు గంటల సినిమాలో దాదాపు గంటన్నర సినిమా మొత్తం ఒకే రూమ్ లో జరిగినప్పటికీ.. ఆడియన్స్ ఎక్కడా బోర్ ఫీలవ్వకుండా తన కెమెరా యాంగిల్స్ తో ఆకట్టుకొన్నాడు ఫణీంద్రవర్మ. స్టాఫ్ కాస్త స్లో అనిపించినా.. సెకండాఫ్ ను మాత్రం టైట్ స్క్రీన్ ప్లేతో రక్తి కట్టించాడు. కొన్ని చోట్ల లాజిక్స్ మిస్ అయ్యాడు.

Plus Points:

  • సంగీతం
  • సినిమాటోగ్రఫీ
  • సెకండ్ హాఫ్
  • క్లైమాక్స్

Minus Points:

  • ఫస్ట్ హాఫ్
  • లాజిక్స్ లేకపోవడం

AP2TG Rating: 2 / 5

Final Verdict:

దేవిశ్రీ ప్ర‌సాద్‌…ఆక‌ట్టుకునే థ్రిల్ల‌ర్‌

Trailer:

Comments

comments

Share this post

scroll to top