త్వరలోనే దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోబోతున్నాడా? దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోబోతున్న ఆ హీరోయిన్ ఎవరు?

దేవి శ్రీ ప్రసాద్. తెలుగు సంగీత ప్రియులని తన సంగీతం తో కట్టిపడేసాడు దేవి. ప్రస్తుతమున్న సంగీత దర్శకుల్లో దేవి శ్రీ ప్రసాద్ టాప్ లో ఉన్నాడంటే అందరు ఒప్పుకుంటారు. ఈ సంవత్సరం దేవి శ్రీ ప్రసాద్ ‘రంగస్థలం’, ‘భారత్ అనే నేను’ సినిమాలకి సంగీతం అందించాడు. రెండు సినిమాలు ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిపోయాయి.


అయితే దేవి శ్రీ ప్రసాద్ ప్రేమ, పెళ్లి వ్యవహారాల్లో కొంచెం నెమ్మదిగా ఉంటాడని అందరికి తెలుసు. దేవి పైన చాలానే పుకార్లు వచ్చేవి అప్పట్లో, పలానా హీరోయిన్ తో ప్రేమాయణం నడుపుతున్నాడని, త్వరలోనే పెళ్లి అంటూ మీడియా చానెల్స్ లో వార్తలు వస్తూ ఉంటాయి. దేవి శ్రీ ప్రసాద్ ప్రేమ లో ఉన్నాడు, పెళ్లి చేసుకోబోతున్నాడు అని వచ్చిన చాలా పుకార్లలో ఛార్మి తో పెళ్లి అనే పుకారు బాగా ఎక్కువగా వినిపించిన పుకారు. కానీ అందులో నిజం లేదని తేలిపోయింది. చాలా రోజుల తరువాత తాజాగా దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్త మరో సారి చెక్కర్లు కొడుతుంది, ఈ సారి పూజిత అనే నటి ని పెళ్లి చేసుకోబోతున్నాడు అంట దేవి శ్రీ ప్రసాద్.
పూజిత ఎవరంటే?

రంగస్థలం సినిమా లో ప్రకాష్ రాజ్ కూతురిగా నటించింది ఈ భామ, రంగస్థలం లో ఆది పినిశెట్టి సరసన హీరోయిన్ గా నటించిన సమయం తక్కువే అయినా, చాలా మందికి గుర్తు ఉండిపోయే పాత్ర లో నటించింది. అయితే పూజిత రంగస్థలం సినిమా ద్వారా దేవి శ్రీ ప్రసాద్ కు దెగ్గర అయ్యిందా, లేఖ ముందు నుండే వీరిరువురికి పరిచయం ఉందా, లేఖ బంధువులు అవుతారా అనే విషయం ఇంకా ఎవరికి తెలియదు. దేవి శ్రీ ప్రసాద్, పూజిత పెళ్లి విషయం త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారు అని జోరుగా చెక్కర్లు కొడుతున్న వార్త. ఒక వేళ దేవి శ్రీ ప్రసాద్, పూజిత ప్రేమ విషయం నిజమైతే, దేవి బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బాయ్ చెప్పి కొత్త జీవితాన్ని మొదలు పెడతాడు అని దేవి అభిమానులు సంతోష పడుతున్నారు.


ప్రస్తుతం రామ్ చరణ్ హీరో గా నటిస్తున్న ‘వినయ విధేయ రామ’ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు దేవి శ్రీ ప్రసాద్. వినయ విధేయ రామ చిత్రానికి బోయపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. 2019 సంక్రాంతి కి వినయ విధేయ రామ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. పెళ్లి విషయం మీద వస్తున్న పుకార్ల పైన దేవి శ్రీ ప్రసాద్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.

Comments

comments

Share this post

scroll to top