ఆ రాష్ట్ర సీఎం అధికారిక నివాసంలో దెయ్యాలు ఉన్నాయ‌ట తెలుసా.!?

మీరు ‘హౌస్ ఆన్ ది హాంటెడ్ హిల్ (House On The Haunted Hill)’ అనే సినిమా చూశారా..? చూడ‌లేదా..? అయితే ఏం ఫ‌ర్వాలేదు లెండి… దాని క‌థను ఇక్క‌డ రెండు ముక్క‌ల్లో చెబుతాం. ఏమీ లేదండీ..! ఓ పురాత‌న భ‌వ‌నం కొండ‌పై చాలా సంవ‌త్స‌రాల నుంచి పాడుబ‌డి ఉంటుంది. అందులో నివ‌సించ‌డానికి ఎవ‌రూ ధైర్యం చేయ‌రు. ఎందుకంటే అందులో దెయ్యాలు ఉన్నాయేమో అని చాలా మంది న‌మ్ముతారు. అయితే దాని ఓన‌ర్ తెలివిగా ఏం చేస్తాడంటే… ఆ భ‌వంతిలో ఒక రోజు పాటు (ప‌గలు+రాత్రి) ఉన్న‌వారికి ల‌క్ష డాల‌ర్ల‌ను ఇస్తాన‌ని అనౌన్స్ చేస్తాడు. దీంతో అందులో ఉండేందుకు కొంద‌రు టీనేజ్ యువ‌తీ యువ‌కులు వ‌స్తారు. వారు రాత్రి పూట అందులోకి దిగుతారు. తెల్లారే స‌రికి కేవ‌లం ఒక్క యువ‌తి మాత్ర‌మే మిగులుతుంది. ఇదీ… ఆ సినిమా స్టోరీ..! అయితే ఈ స్టోరీ త‌గిన‌ట్టుగానే అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోనూ ఓ భ‌వంతి ఉందండోయ్‌..! అయితే అది పురాత‌న భ‌వ‌నం కాదు. గ‌త 8 ఏళ్ల కింద‌ట నిర్మించిందే. అయితే అందులో దెయ్యాలున్నాయ‌ట‌. అందుకని అందులో ఉండేందుకే ప్ర‌జ‌లు భ‌య‌ప‌డుతున్నారు. ఇంత‌కీ ఆ భ‌వ‌నం ఎవ‌రిదో తెలుసా..? ఆ రాష్ట్ర సీఎం నివాసం ఉండే అధికారిక భ‌వ‌నం అది..!

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని ఈటాన‌గ‌ర్‌లో 2009లో రూ.60 కోట్ల వ్య‌యంతో కొండ‌మీద ఓ బంగ్లాను నిర్మించారు. ఆ రాష్ట్ర సీఎం అధికారిక నివాసంగా దాన్ని నిర్మించారు. అయితే అందులో నివ‌సించిన సీఎంలు అంద‌రూ చ‌నిపోయారు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. మొద‌టి సారిగా అందులోకి దిగిన సీఎం దోర్జీ ఖండూ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో మృతి చెందారు. ఆ త‌రువాత వ‌చ్చిన జార్బోమ్ గామ్లిన్ దీర్ఘకాలిక వ్యాధితో మరణించారు. అనంత‌రం కాంగ్రెస్ పార్టీకి చెందిన నబమ్‌ టుకీ అధికారంలోకి వ‌చ్చారు. కానీ ఆయ‌న ఎక్కువ రోజుల పాటు సీఎంగా ఉండ‌లేదు. ఆ త‌రువాత అధికారంలోకి వ‌చ్చిన కల్ఖో పుల్ అనుమానాస్ప‌ద స్థితిలో ఆ భ‌వంతిలో మృతి చెందారు. ఆయ‌న మృత‌దేహం ఫ్యానుకు వేలాడుతూ క‌నిపించింది. ఆ త‌రువాత అందులో ప‌నిచేసే సిబ్బంది మృత‌దేహాలు ప్ర‌త్య‌క్ష‌మ‌వ‌డం ప్రారంభించాయి. దీంతో దాన్ని మూసేశారు.

అయితే ప్ర‌స్తుతం సీఎంగా ఉన్న పెమా ఖండూ మాత్రం ఆ భ‌వంతిలోకి వెళ్ల‌లేదు. వేరే నివాసంలో ఉంటున్నారు. అయితే ప్ర‌స్తుతం ఆ బంగ్లాను గెస్ట్ హౌస్ గా మార్చే ప‌నిలో ప‌డ్డారు అధికారులు. అయితే అంత‌కు ముందుగా పలువురు పూజారులు, రుషులు, చర్చి ఫాదర్లతో ఆ బంగ్లాను శుద్ధి చేయించారు. ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మాల‌ను కూడా భారీ స్థాయిలో చేశారు. అనంత‌రం దాన్ని గెస్ట్ హౌస్ గా మార్చారు. అయినప్ప‌టికీ అందులో ఉండాలంటే జ‌నాలు జంకుతున్నార‌ట‌. అవును మ‌రి… అది నిజ‌మే. అలాంటి వార్త‌లు వ‌చ్చాక‌, ఆ స్థాయిలో అనుమానాస్ప‌ద మృతులు చోటు చేసుకున్నాక ఇంకా ఎవ‌రు అందులోకి వెళ్లేందుకు సాహ‌సిస్తారు చెప్పండి. ఏమో మ‌రి… పైన చెప్పాం క‌దా… ఆ హాలీవుడ్ సినిమాలోలా ఎవ‌రికైనా బంప‌ర్ ఆఫ‌ర్ ఇస్తామ‌ని, అందులో ఒక రోజు ఉండ‌మ‌ని చెబుతారేమో..? వేచి చూస్తే తెలుస్తుంది..!

Comments

comments

Share this post

scroll to top