నాన్నకు ప్రేమతో….ఆడియో రిలీజ్ లో ఏడ్చిన దేవీ ప్రసాద్…ఓదార్చిన Jr.NTR.

‘నాన్నకు ప్రేమతో’ ఆడియో లాంచ్ మొత్తం ఎమోషనల్ గా సాగింది.ఎన్టీఆర్ తన తండ్రి హరికృష్ణ గురించి, సుకుమార్ తన తండ్రి కొన ఊపిరితో ఉండగా ఈ స్టొరీ పుట్టిందని ఎమోషనల్ అయ్యాడు. ఇక ఈ చిత్రానికి సంగీతాన్ని అందించిన దేవిశ్రీప్రసాద్ తన తండ్రి మరణంచిన తర్వాత అంత్యక్రియలు పూర్తిచేసి, మూడు రోజుల తర్వాత నాన్నకు ప్రేమతో సినిమాలో రఘుదీక్షిత్ తో డోంట్ స్టాప్ పాట  పాడించాను అనే నాకు మెసేజ్ పెట్టాడని ఎన్టీఆర్ చెబుతుండగా దేవిశ్రీప్రసాద్ ఒక్కసారిగా కన్నీటిపర్యంతం అయ్యాడు. పక్కనే దేవి తమ్ముడు సాగర్ ఓదారుస్తున్న దేవి ఎమోషన్ ను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. నిన్ను బాధపెట్టి ఏడిపించినందుకు సారీ దేవి అని ఎన్టీఆర్ అన్నాడు. ఏడుపు ఆపుకోలేకపోయిన దేవి, ఎన్టీఆర్ దగ్గరికి వచ్చి హత్తుకున్నాడు. ఈ సందర్భంగా ప్రేక్షకులను స్టాండింగ్ ఒవేషన్ తో అభినందించాలని ఎన్టీఆర్ తెలుపగా ప్రేక్షకులు నిలబడి చప్పట్లతో అభినందించారు.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top