దేవిశ్రీ ప్రసాద్ తండ్రి కన్నుమూత.. మంచి కథా రచయితను కోల్పోయిన ఇండస్ట్రీ.

టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా అలరిస్తున్న దేవిశ్రీప్రసాద్ తండ్రి సత్యమూర్తి  (61) ఈరోజు ఉదయం  చెన్నైలోని తన నివాసంలో హార్ట్ ఎటాక్ తో తుదిశ్వాస విడిచారు. సత్యమూర్తి అకాల మరణంతో దేవిశ్రీప్రసాద్ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. సత్యమూర్తి తెలుగు సినిమా పరిశ్రమలో కథా రచయితగా సూపర్ హిట్ సినిమాలకు పనిచేశారు. ఆయన మొదటి సినిమా రాఘవేంద్రరావు, శోభన్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కిన  ‘దేవత’. ‘ఛాలెంజ్’,’పెదరాయుడు’, ‘ఖైదీ నెంబర్ 786’, ‘చంటి’, ‘అభిలాష’, ‘బంగారు బుల్లోడు’ వంటి సూపర్ హిట్ సినిమాలకు రచయితగా పనిచేసిన సత్యమూర్తి, దాదాపు 90 సినిమాలకుపైగా రచయితగా మెప్పించాడు. సత్యమూర్తి మృతిపట్ల సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం చెన్నైలో సత్యమూర్తి అంత్యక్రియలను జరపనున్నారు.

DEVI

Comments

comments

Share this post

scroll to top