విడుదలైన హీరో ‘కార్తీ’ కొత్త మూవీ ‘దేవ్’ టీజర్, కొత్త లుతో అదరగొట్టాడు..!

‘ఖాకీ’ సినిమా తో తెలుగులో స్టార్ హీరో గా మారిపోయాడు హీరో ‘కార్తీ’. హీరో ‘సూర్య’ తమ్ముడిగా తెలుగు చిత్రసీమ లోకి అడుగుపెట్టిన కార్తీ, ఓన్ డబ్బింగ్, తన డిఫరెంట్ స్క్రిప్ట్ సెలక్షన్, నటనతో తెలుగు ప్రేక్షకులకు దెగ్గర అయిన కార్తీ, ప్రస్తుతం ‘దేవ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు, ఆ సినిమా లో ‘రకుల్ ప్రీత్ సింగ్’ హీరోయిన్ గా నటిస్తుంది, ‘ప్రకాష్ రాజ్’, ‘రమ్య కృష్ణ’ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ రోజు ఈ చిత్ర టీజర్ ని విడుదల చేసారు.

‘చిన్నబాబు’ చిత్రం తో తెలుగు లో యావరేజ్ హిట్ అందుకున్న కార్తీ, ‘దేవ్’ చిత్రం మీదే ఆశలు పెట్టుకున్నాడు, అయితే చిన్న బాబు తమిళ్ వెర్షన్ అయిన ‘కడైకుట్టి సింగం’ తమిళ్ లో ఘన విజయం సాధించింది, ఏకంగా ఒక్క తమిళ్ నాడు లోనే 50 కోట్లకు పైగా వసూళ్ళని రాబట్టి తమిళ్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరిచాడు.దాంతో తమిళ్ లో దేవ్ చిత్రానికి మంచి క్రేజ్ ఏర్పడింది, ఈ సారి తమిళ్ లోనే కాకుండా తెలుగు లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొడతా అని నమ్మకం తో ఉన్నాడు కార్తీ.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top