ఈ సారి థియేటర్లో సినిమాలు చూసేటప్పుడు ఈ 11అంశాలను తప్పకుండా గమనించండి.

థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు సినిమాకు సంబంధించిన పేర్లు పడుతుంటాయి మనం అక్కడి నుండే సినిమాలోకి లీనమవుతుంటాం. అయితే దాని కన్నా ముందే ప్లే అయ్యే  సెంట్రల్ బోర్డ్ ఫిల్మ్ జారీ చేసే సర్టిఫికేట్ ను అంతగా పట్టించుకోం. వాస్తవానికి ఈ సినిమాకు సంబంధించిన చాలా వివరాలు, విషయాలు ఈ సర్టిఫికేట్ లో ఉంటాయి. ఇప్పుడు సినిమా సర్టిఫికేట్ లో మనం తెలుసుకోవాల్సిన అంశాలును ఒక్కొక్కటిగా చూద్దాం.

  1. U సర్టిఫికేట్…అంటే ఎవరైనా ఈ సినిమాను చూడవచ్చని సెంట్రల్ బోర్డ్ అనుమతి ఇచ్చినట్టు.

1

2 )12 సంవత్సరాల లోపు పిల్లలు ఈ సినిమా చూడడానికి తల్లీదండ్రుల అనుమతి తప్పనిసరి.

2

3) 18 సంవత్సరాలోపు పిల్లలు ఈ A సర్టిఫికేట్ సినిమాలు చూడడానికి వీల్లేదు.

3

4) సినిమా పేరు,అది ఏ భాషలో ప్రదర్శితమవుతుంది, సినిమా యొక్క స్పెషాలిటీస్ ఏమైనా ఉంటే సర్టిఫికేట్ లోని ఈ ప్రాంతంలో ముద్రితమై ఉంటాయ్.

5

5) సినిమా నిడివి. రీల్స్ కు సంబంధించిన సమాచారం సర్టిఫికేట్ కుడి వైపు ఉంటుంది.

6

6) సర్టిఫికేట్ కు సంబందించిన నెంబర్ ఏ సంవత్సరంలో , ఏ ఆఫీస్ లో సర్టిఫికేట్ జారీ చేశారు అనే విషయాలు ఇక్కడ ఉంటాయి.

7

7) సెన్సార్ కమిటీ సభ్యుల పేర్ల వివరాలు సర్టిఫికేట్ ఎడమ భాగం కింద వైపులో ఉంటాయి.

8

8) సర్టిఫికేట్ కోసం అప్లే చేసుకున్నవారి పేరు మరియు నిర్మాత లేదా సంస్థ పేరు ఇక్కడ ఉంటుంది.

9

9) సినిమా కు సంబంధించి ఏదైనా సీక్వెల్ తీసేది ఉంటే ముందుగానే  ఆ హక్కులకు సంబంధించిన సమాచారం ఇక్కడ ఉంటుంది.

10

10) సర్టిఫికేట్ లో మనం ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఇది. ఇలా చూపినట్టు త్రిభుజాకార గుర్తుంటే..ఈ సినిమాలోని ఏదో కొంత భాగాన్ని సెన్సార్ బోర్డ్ అభ్యంతరం చెప్పిన తర్వాత తొలగించారని అర్థం.

11

11) సినిమా ప్రారంభానికి ముందు సదరు సినిమాకు సెంట్రల్ ఫిల్మ్ బోర్డ్ ద్వారా జారీ చేసిన ఈ సర్టిఫికేట్ ను కనీసం 10 సెకండ్ల పాటు తెరపై చూపాలి.

12

Comments

comments

Share this post

scroll to top