H-1B విస్సా అంటే ఏమిటి? ఈ విసా ఎవ‌రికి ఇస్తారు? దీని వెనక ఏమైనా కుట్ర‌దాగుందా??

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్రారంభం నుండి H-1B విస్సా గురించి పెద్ద ఎత్తున్న చ‌ర్చ నడుస్తుంది. ఇక ట్రంప్ అధ్య‌క్షుడైన‌ప్ప‌టి నుండైతే మ‌రీను…H-1B విస్సా ఉన్న‌వారినే అమెరికాలోకి రానిస్తారు అనే ప్ర‌చారాలు కూడా సాగుతున్నాయి. అస‌లు H-1B విస్సా అంటే ఏమిటి? ఈ విస్సాను ఎవ‌రికి ఇస్తారు అనే విష‌యాలు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.

H-1B అమెరికాలో ప్రవాసేతరుల‌కు ఇచ్చే వీసా . ప్రత్యేకమైన వృత్తులలో ప్రావీణ్యులైన విదేశీ శ్రామికులను త‌మ సంస్థ‌ల్లో నియ‌మించుకోడానికి ఆ కంపెనీ య‌జ‌మానుల‌కు అమెరికా ఈ అనుమతినిస్తుంది. H -1B వీసాతో అనుమతించబడిన విదేశీ శ్రామికుడిని అతని యజమాని పని నుండి తొలగించినపుడు లేదా, తనంత తానుగా పనిని వదలివేసినపుడు, అతడు మరో H-1B వీసాను పొందడం కోసం మరో యజమాని కింద పనిలో చేరడం కానీ, లేదా USA ని వదలి పోవడం కానీ చేయాలి.

ప్రత్యేకమైన వృత్తులు అంటే….?
ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, గణితం, భౌతికశాస్త్రాలు, సామాజికశాస్త్రాలు, బయోటెక్నాలజీ, వైద్యవిద్య, ఆరోగ్యం, విద్య, న్యాయం, ఆర్థిక నిర్వహణా, వాణిజ్య నిపుణతలు, మతశాస్త్రం, కళలు వంటి వృత్తులు ( కొన్ని మిన‌హాయింపులున్నాయి). ఖ‌చ్చితంగా ఆయా రంగాల్లో ప‌ట్ట‌భ‌ద్రులై ఉండాలి.

దీని గ‌రిష్ఠ ప‌రిమితి ఎంత?

నియమాలను అనుసరించి H-1B వీసాకు గరిష్ఠ గడువు ఆరు సంవత్సరాలు. ఆరు సంవత్సరాల గరిష్ఠ గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలో నివసించదలుచుకున్నట్లయితే, వారు తిరిగి H-1B వీసాను పొందడంకోసం అమెరికాకు బయట ఒక సంవత్సరం పాటు నివసించవలసి ఉంటుంది. ( కొన్ని మిన‌హాయింపులున్నాయి).

సంవ‌త్స‌రానికి H-1B వీసా ఎంత మందికిస్తారు?

ప్రతీ ఆర్థిక సంవత్సరానికి  65,000 మంది విదేశీయులకు మాత్రమే వీసాను ఇస్తారు.

ఇత‌ర ప్ర‌యోజ‌నాలు :
H-1B వీసా కలిగిన వారు తమ సన్నిహిత కుటుంబ సభ్యులను (జీవితభాగస్వామి, 21 ఏళ్ల లోపు వయసున్న పిల్లలు) H4 వీసా విభాగంలో ఆధారపడినవారుగా అమెరికాకు తీసుకురావడానికి అనుమతించబడతారు.

వీళ్ల జీతం ఎలా ఉంటుంది.

వీరికి సుమారుగా త‌క్కువ‌లో త‌క్కువ గంట‌కు 50 డాల‌ర్ల ప్ర‌కారం చెల్లిస్తారు.

టాక్స్ లు ఎలా ఉంటాయి.?

  • సోష‌ల్ సెక్యురిటీ టాక్స్-6.2%
  • మెడికేర్ టాక్స్-1.45%
  • H-1B విసా క‌లిగిన వారి హెల్త్ ఇన్స్యూరెన్స్ లో… 75 శాతం కంపెనీయే భ‌రిస్తుంది. మిగిలిన 25 శాతం ఉద్యోగి చెల్లించాల్సిన అవ‌స‌రం ఉంటుంది.

సింపుల్ గా చెప్పాలంటే….. ఎక్కువ డ‌బ్బు సంపాది0చే వాళ్ల‌కే ఈ విస్సాను ఇస్తారు… వారి నుండి ఎక్కువ మొత్తంలో టాక్స్ రూపంలో గుంజుతారు. చిన్న స్థాయి విదేశీ ఉద్యోగుల‌ను అమెరికాకు రాకుండా అడ్డుకొని….వారి స్థానంలో స్థానిక అమెరిక‌న్ల‌కు ఉద్యోగాలు క‌ల్పిస్తారు.ఇదే ఎన్నిక‌ల‌కు ముందు ట్రంప్ చెప్పిన విష‌యం…H-1B వీసా వారికి మాత్ర‌మే అమెరికా ప్ర‌వేశం…అంటే ఇదే జ‌రుగుతుంది.

Comments

comments

Share this post

scroll to top