ఆమె నిరుపేద‌రాలు… అయినా 400 కుక్క‌ల‌ను పోషిస్తోంది..!….ఆమె కథ వింటే తప్పక అభినందిస్తారు!

పురాత‌న కాలం నుంచి కుక్క‌లు మ‌నుషుల‌కు అత్యంత ద‌గ్గ‌రైన మిత్రులుగా మెలుగుతూ వ‌స్తున్నాయి. వీటిని పెంచుకోవడం చాలా మందికి ఇష్ట‌మే. అయితే త‌క్కువలో త‌క్కువ ఏ కుక్క‌ను పెంచుకున్నా దానికి నెల‌కు క‌నీసం రూ.2వేల నుంచి ఖ‌ర్చ‌వుతుంది. దీంతో చాలా మంది వీటిని పెంచుకోవ‌డానికి వెనుక‌డుగు వేస్తారు. అయితే బాగా డ‌బ్బున్న వారు అందుకు మిన‌హాయింపు కాదు లెండి. కానీ ఎంత డ‌బ్బున్నా వారు ప‌దుల సంఖ్య‌కు మించి మాత్రం కుక్క‌ల్ని పెంచుకోరు క‌దా..! కానీ… ఆమె అలా కాదు ఏకంగా 400 కుక్క‌ల‌ను పెంచుకుంటోంది. అయితే మ‌రి ఆమె బాగా ధ‌న‌వంతురాలు అయి ఉండాలే అని మీరు అనుకోవ‌చ్చు. కానీ… ఆమె నిరుపేద రాలు. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. నిరుపేదరాలు అయినా కుక్క‌లను పెంచుకోవ‌డం మాత్రం మాన‌లేదు.

prathima-devi-1

ఆమె పేరు ప్ర‌తిమాదేవి. ప‌శ్చిమ‌బెంగాల్‌లో జ‌న్మించింది. ఆమెకు 13వ ఏటే పెళ్లి అయింది. 14వ ఏట మొద‌టి శిశువుకు జ‌న్మ‌నిచ్చింది. అనంతరం కొన్నాళ్ల‌కు మ‌రో ఇద్ద‌రు సంతానం క‌లిగారు. దీంతో బ‌తుకు దెరువు నిమిత్తం ఆమె పెద్ద కుమారుడితో క‌లిసి ఢిల్లీకి వ‌చ్చింది. అక్క‌డే ప‌లు ఇండ్లలో ప‌నిచేస్తూ వ‌చ్చిన దాంట్లోనే తృప్తిగా జీవించేది. అనంతరం ఓ టీస్టాల్‌ను ప్రారంభించింది. అది బాగా న‌డ‌వ‌డంతో డబ్బు కూడా ఆమెకు బాగానే వచ్చేది. ఈ క్ర‌మంలో ఆమె త‌న భ‌ర్త దూర‌మ‌వడంతో అత‌ని వ‌ద్ద ఉన్న ఇద్ద‌రు పిల్ల‌ల‌ను ఢిల్లీకి తీసుకువచ్చి త‌న ద‌గ్గరే పెట్టుకుంది. వ్యాపారం బాగా క‌ల‌సి రావ‌డంతో ఆమె తొంద‌ర‌గా ఇల్లు కూడా కొనేసింది. అయితే ఆ ఇంటితోపాటు ఆమెకు అక్క‌డ తిరిగే వీధి కుక్క‌లు కూడా తోడ‌య్యాయి.

అలా ప్ర‌తిమాదేవి త‌న ద‌గ్గ‌రకు వచ్చిన కుక్క‌ల‌ను వ‌దిలిపెట్ట‌కుండా పోషిస్తోంది. ఈ క్ర‌మంలో ఆమె ద‌గ్గ‌ర ఇప్ప‌టికి 400కు పైగానే కుక్క‌లు చేరాయి. వాట‌న్నింటినీ ఆమె పోషిస్తోంది. అయితే ఇప్పుడు ఆమె చేస్తున్న ప‌ని ఏంటో తెలుసా..? వీధుల్లో చెత్త ఏరుకోవ‌డం. అలా ప‌నిచేసి దాంతో వ‌చ్చిన డ‌బ్బుతో త‌న‌ను తాను పోషించుకోవ‌డ‌మే కాదు, ఆ కుక్క‌ల‌నూ పోషిస్తోంది. వాటికి ఉదయం 6 గంటలకు పాలు, బిస్కెట్స్, మధ్యాహ్నం 12 గంటలకు ఆహారంతో పాటు పాలు, రాత్రి 11 గంటలకు భోజనం సమకూరుస్తుంది. ఇక రాత్రి పూట ఆమె నివాసంలో ఉండకపోతే కుక్కలు కూడా నిద్ర పోవట. ఆమె లేకుండా కూడా భోజనం చేయవట. కుక్కలకున్న విశ్వాసం అది. ఏది ఏమైనా… త‌న‌కు లేక‌పోయినా… ఉన్న‌దాంట్లోనే ఆ మూగ జీవాల ఆక‌ల తీరుస్తున్న ప్ర‌తిమా దేవిని నిజంగా మ‌నం అభినందించాల్సిందే..!

Comments

comments

Share this post

scroll to top