రెండు చేతులు లేక‌పోయినా 1 ల‌క్ష వ‌ర‌కు పెయింటింగ్స్ వేశాడు అత‌ను..!

ఉన్నత ల‌క్ష్యాల‌ను సాధించాల‌ని, జీవితం అన్నాక ఏదో ఒక గొప్ప ప‌ని చేయాల‌ని, న‌లుగురిలోనూ మ‌న‌కంటూ ఓ స్థానం క‌లిగి ఉండాలనే త‌ప‌న ఉంటే చాలు. ఎవ‌రైనా ఏదైనా సాధించ‌వ‌చ్చు. అందుకు ఎన్ని క‌ష్టాలు వ‌చ్చినా అలాంటి వారిని ఏమీ చేయ‌లేవు. ఇప్పుడు మేం చెప్ప‌బోయేది కూడా అలాంటి ఓ వ్య‌క్తి గురించే. అత‌నికి రెండు చేతులు లేవు. అయినా ఇప్ప‌టి వ‌ర‌కు 1 ల‌క్ష వ‌ర‌కు పెయింటింగ్స్ వేశాడు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఇంత‌కీ ఆ వ్య‌క్తి ఎవ‌రంటే…

అత‌ని పేరు మాంఝీభాయ్ ర‌మ‌ణి. ఉంటున్న‌ది అహ్మ‌దాబాద్‌లో. కాగా మాంఝీభాయ్‌కు 10 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న‌ప్పుడు అనుకోకుండా ఓ దుర‌దృష్ట‌క‌ర సంఘ‌ట‌న జ‌రిగింది. అత‌ను త‌న స్నేహితుల‌తో క‌ల‌సి చెరుకు నుంచి జ్యూస్ తీసే మిష‌న్ వ‌ద్ద ఆడుకుంటుండ‌గా దుర‌దృష్ట‌వ‌శాత్తూ అత‌ని రెండు చేతులు ఆ మిష‌న్‌లో ప‌డ్డాయి. దీంతో అత‌ను త‌న రెండు చేతుల‌ను కోల్పోయాడు. ఆ త‌రువాత 6 సంవ‌త్స‌రాల వ‌ర‌కు అత‌ను ఏమీ చేయ‌లేదు. అయినా మాంఝీభాయ్ దిగులు చెంద‌లేదు. ఎలాగైనా జీవితంలో ఉన్న‌త స్థానాల‌కు చేరుకోవాల‌నుకున్నాడు.

క‌ష్ట‌ప‌డి విద్య‌ను అభ్య‌సించాడు. స్కూల్‌, కాలేజీల‌లో చ‌దువును పూర్తి చేశాడు. చేతులు లేక‌పోయినా త‌న నోటితోనే రాయ‌డం అల‌వాటు చేసుకుని ప‌రీక్ష‌లు రాశాడు. అనంతరం అత‌ని దృష్టి పెయింటింగ్ వైపు మ‌ళ్లింది. ఈ క్ర‌మంలోనే ఓ ఆర్ట్స్ కాలేజీలో ఫైన్ ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. అప్పుడు కూడా మాంఝీభాయ్ త‌న నోటితోనే పెయింటింగ్ వేయ‌డం అల‌వాటు చేసుకున్నాడు. ఆ త‌రువాత ఇక అత‌ను వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. ఇప్ప‌టి వ‌ర‌కు 1 ల‌క్ష వ‌ర‌కు పెయింటింగ్స్ వేశాడు. వాటిని చాలా మంది కొనుగోలు చేశారు. మ‌న దేశం వారే కాదు, చాలా మంది విదేశీయులు కూడా మాంఝీభాయ్ పెయింటింగ్స్‌ను కొంటున్నారంటే అది అత‌ని ప్ర‌తిభ‌కు నిద‌ర్శ‌నం. చేతులు లేక‌పోయినా అలా నోటి ద్వారా 1 ల‌క్ష వ‌ర‌కు పెయింటింగ్స్ వేశాడంటే మాంఝీభాయ్ ప్ర‌తిభ‌కు నిజంగా మ‌నం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top