హోటల్స్‌, రెస్టారెంట్లలో వేసే జీఎస్‌టీ 5 శాతానికి తగ్గింది. అయినా బిల్లులో మాత్రం మార్పులేదు. ఎందుకో తెలుసా..?

జీఎస్టీ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక వస్తువులకు చెందిన శ్లాబులను మార్చారు. కొన్నింటికి తగ్గించారు. కొన్నింటికి పెంచారు. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు ఆయా వస్తు, సేవలకు గాను శ్లాబులను, రేట్లను తగ్గిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈ మధ్యే సమావేశమైన జీఎస్‌టీ కౌన్సిల్‌ రెస్టారెంట్లలో ఉన్న 12, 18 శాతం జీఎస్‌టీని ఏకంగా 5 శాతానికి తగ్గించింది. అయితే జీఎస్‌టీ 5 శాతానికి తగ్గినప్పటికీ చాలా వరకు హోటల్స్‌, రెస్టారెంట్లలో భోజనం చేసే కస్టమర్లకు బిల్‌ అదే అవుతోంది. అవును, జీఎస్‌టీ తగ్గకముందు.. అంటే.. 12, 18 శాతం జీఎస్‌టీ ఉన్నప్పుడు ఏదైనా ఫుడ్‌ తింటే అప్పుడు ఎంత బిల్‌ పడేదే, ఇప్పుడు.. అంటే జీఎస్‌టీ 5 శాతం అయిన తరువాత కూడా హోటల్స్‌లో పుడ్‌ తింటే అంతే బిల్‌ వస్తోంది. ఏంటీ.. నమ్మలేరా.. కావాలంటే కింద ఇచ్చిన ఓ శాంపిల్‌ బిల్‌ చూడండి.

చూశారుగా.. అమోఘ్‌ అనే వ్యక్తి అంతకు ముందు మెక్‌ డొనాల్డ్స్‌ రెస్టారెంట్‌లో తిన్న ఐటమ్‌కు రూ.142 బిల్ అయింది. అప్పుడు జీఎస్‌టీ 18 శాతంగా ఉంది. అయితే తాజాగా ఇప్పుడు అతను అదే ఐటమ్‌ తిన్నాడు. కాగా ప్రస్తుతం 5 శాతం జీఎస్‌టీ ఉన్నా బిల్‌ మాత్రం పాత బిల్‌లాగే రూ.142 వచ్చింది. దీంతో షాకైన అమోఘ్‌ ఇదే విషయాన్ని తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. షేమ్‌ మెక్‌ డొనాల్డ్స్‌ అంటూ ట్వీట్‌ చేశాడు. ఈ క్రమంలో అనేక మంది నెటిజన్లు కూడా అమోఘ్ కు మద్దతు పలికారు. నిజంగా ఇది కస్టమర్లను దోచుకోవడమే అని చాలా మంది ఈ విషయాన్ని ఖండించారు. అంతేకాదు సదరు బిల్స్‌ను ఆర్థిక మంత్రి జైట్లీ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఇంకా స్పందించలేదు.

అయితే ఈ విషయంపై మెక్‌ డొనాల్డ్స్‌ స్పందించింది. గతంలో జీఎస్‌టీ 18 శాతంగా ఉన్నప్పుడు తమకు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ లభించేదని, కనుక ఫుడ్‌ ఐటమ్‌ను తక్కువ రేట్‌కు అందించామని సదరు సంస్థ చెప్పింది. అయితే ఇప్పుడు జీఎస్‌టీ 5 శాతం చేసినందున తమకు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ లభించడం లేదని, కాబట్టి ఫుడ్‌ ఐటమ్‌ ధర పెంచామని, కనుకనే 5 శాతం జీఎస్‌టీ ఉన్నప్పటికీ ఫుడ్‌ ఐటమ్‌ ధర పెరగడం వల్ల బిల్‌లో ఎలాంటి మార్పు లేదని మెక్‌డొనాల్డ్స్‌ చెప్పింది. అయితే దీనిపై చాలా మంది పెదవి విరుస్తున్నారు. ఈ ఇంత మాత్రానికి జీఎస్‌టీని తగ్గించి ప్రయోజనం ఏమిటని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఏమో మరి.. ఇందులో ఏం మతలబు ఉందో. ఏది ఏమైనా జీఎస్‌టీ పెరిగినా, తగ్గినా ఈ ఫుడ్‌ ఐటమ్‌ లను హోటల్స్‌లో తిన్నప్పుడు బిల్లు మాత్రం ఒకేలా వస్తుందనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి..! లేదంటే ఇలాంటి షాక్‌లే తగులుతాయి..!

Comments

comments

Share this post

scroll to top