ఒక్క హిట్ ఇవ్వకపోతారా అని ఆశగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్.. హిట్ అందుకోకపోతే కష్టమే..

తెలుగు లో చాలా మంది హీరో లు ఉన్నారు. కానీ స్టార్ హీరోలుగా గుర్తింపు దక్కించుకుంది మాత్రం కొందరే, ఆ కొందరిలో గోపీచంద్, రవితేజ, నితిన్, సాయి ధరమ్ తేజ్ కూడా ఉన్నారు, అయితే ప్రస్తుతం వీరి కెరీర్ లు ప్రమాదం లో పడ్డాయా అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు, వీరి గత చిత్రాలన్నీ ఫ్లాప్స్ ఏ. కేవలం ఒక్క సినిమా ఫ్లాప్ అయితే పెద్ద ప్రమాదం ఏం ఉండదు, కానీ ఈ హీరోల గత 3,4 చిత్రాలన్నీ ఫ్లాప్స్ ఏ.

రవితేజ : అందరు మెచ్చిన, అందరికి నచ్చిన హీరో రవితేజ. మాస్ మహారాజ్ అని ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకుంటారు. సంవత్సరానికి రెండు మూడు సినిమాలైనా రిలీజ్ చేస్తుంటారు ఈయన. రాజా ది గ్రేట్ తరువాత మళ్ళీ ట్రాక్ లోకి పడ్డాడు అని అందరు అనుకున్నారు. సిల్వర్ స్క్రీన్ మీదనే కాదు, బుల్లి తెరమీద కూడా రాజా ది గ్రేట్ సెన్సేషన్ క్రిఏట్ చేసింది. అయితే రాజా ది గ్రేట్ తరువాత వచ్చిన మూడు చిత్రాలు ఘోర పరాజయాలుగా మిగిలిపోయాయి. టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్బర్ ఆంథోనీ.. ఈ మూడు చిత్రాలు ఒకదానికి మించి మరొకటి బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. అయితే ప్రస్తుతం వి.ఐ. ఆనంద్ తో క సినిమా చేస్తున్నారు రవితేజ. ఈ సినిమా మీదే అభిమానులు ఆశలన్నీ పెట్టుకున్నారు. ఈ సినిమా ఫలితం మీద రవితేజ తదుపరి చిత్రాల ఫేట్ డిపెండ్ అయి ఉంటాది.

గోపీచంద్ : గోపీచంద్ పేరు వినగానే యాక్షన్ హీరో అఫ్ టాలీవుడ్ అనే పదం వెంటనే గుర్తొస్తుంది. యాక్షన్ హీరో గా మంచి పేరు తెచ్చుకున్న గోపీచంద్. మోస్ట్ అండర్ రేటెడ్ హీరో గా కూడా పేరు తెచ్చుకున్నాడు. గౌతమ్ నంద చిత్రం బాగున్నా, సరైన ప్రొమోషన్స్ లేక జనాలకు రీచ్ అవ్వలేదు, ఇక 25 వ చిత్రం గా వచ్చిన పంతం సినిమా అనుకున్నంత స్థాయి లో ఆడలేదు. గోపీచంద్ నుండి ఒక సాలిడ్ హిట్ కోసం ఫ్యాన్స్ ఏ కాదు, కామన్ ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు.

ధరమ్.. ఇదేమైనా ధర్మమేనా : సాయి ధరమ్ తేజ్, తేజ్ బాబు కి మొదట్లో పడిన హిట్ లు చూసి మరో అల్లు అర్జున్ లా అవుతాడని మెగా ఫ్యాన్స్ అంత ఆశలు పెట్టుకున్నారు. మాస్ జనాల్ని ఆకట్టుకోవడం లో సక్సెస్ అయ్యాడు ధరమ్ బాబు. ఏ ముహూర్తాన అంటూ తిక్క సినిమాలో నటించాడో, అక్కడే అతని పతనానికి బీజం పడింది, ఆ తరువాత వచ్చిన విన్నర్, జవాన్, ఇంటెలిజెంట్, నక్షత్రం, తేజ్ ఐ లవ్ యు చిత్రాలు బాక్స్ ఆఫీస్ దెగ్గర ఘోర పరాజయాలుగా మిగిలిపోయాయి. వరుసగా 6 చిత్రాలు ఫ్లాప్ కావడం తో మెగా ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు, ధరమ్ బాబు కి చివరి హిట్ సుప్రీమ్ సినిమా. ప్రస్తుతం నేను శైలజ డైరెక్టర్ తో చిత్రలహరి అనే సినిమా చేస్తున్నాడు.

నితిన్, మరొక్కసారి : వరుస పరాజయాలు, అయిపోయినట్టే కాదు, ఇంక అయిపోయింది అనుకున్న సమయం లో ఇష్క్ సినిమా తో కంబ్యాక్ ఇచ్చాడు నితిన్.. ఆ తరువాత హిట్స్, ఫ్లాప్స్ ఇలా లేస్తూ పడుతూ ప్రయాణం సాగిస్తున్నాడు నితిన్. కానీ అ ఆ చిత్రం తరువాత మూడు పరాజయాలు ఎదురుకున్నాడు. లై, చల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం. ఈ మూడు సినిమాలు పరాజయాలవ్వడంతో ఒక మంచి హిట్ కోసం నితిన్ ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం చలో మూవీ దర్శకుడితో ఒక సినిమా తీస్తున్నాడు నితిన్. ఆ సినిమా హిట్ అయితే మరో సారి ట్రాక్ లోకి రావడం ఖాయం.

ఈ నలుగురి హీరోలకి హిట్ టాక్ వస్తే చాలు, వీరి లెక్క ఎక్కడ ఆగుతుందని ఎవ్వరూ చెప్పలేరు, వీరికి అభిమానుల సంఖ్య కూడా ఎక్కువే. అందుకే ఎన్ని పరాజయాలు ఎదురైనా ఒక్క హిట్ ఇవ్వకపోతారా అని ఆశగా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. అభిమానుల కోసం అయినా ఒక్క హిట్ ఇచ్చి. 2019 వీరి అభిమానులకి గుర్తిండిపోయేలా చేస్తారని ఆశిస్ధామ్.

Comments

comments

Share this post

scroll to top