డేరా బాబా ఆశ్రమంలో యువతలు “రేప్” కి గురికాకుండా తప్పించుకోవడానికి ఏం చేసేవారో తెలుసా.?

కుల వివక్ష తీవ్రంగా ఉండే పంజాబ్‌, హర్యానా లోని దళితులు, వెనుకబడిన వర్గాలను ఏకం చేసిన సామాజిక, ఆధ్యాత్మిక జీవన విధానమే డేరా స్వచ్ఛ సౌదా. 1950 దశకం చివర్లో మొదలైన ఈ మతంలో సామాజిక, కుల అంతరాలను భరించలేని గిరిజన, దళిత, బీసీలు లక్షలాదిగా ఇందులో జాయినయ్యారు. ఒకరకంగా అది జీవన స్థైర్యాన్నిచ్చింది వారికి. నిజానికి డేరా సౌదా ఒక ఆదర్శనీయ సమాజాన్ని ప్రవచిస్తుంది.  దీన్ని మరింత ఎత్తులకు తీసుకెళ్లాడు గుర్మీత్ డేరా.డేరా బాబా అలియాస్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ను అత్యాచార కేసులో సిబిఐ కోర్టు దోషిగా నిర్ధారించింది..తర్వాత  డేరా బాబా లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతూ షాకింగ్ కు గురిచేస్తున్నాయి.

ఆశ్రమంలో తాను కోరుకున్న అమ్మాయిని లోబర్చుకునేందుకు ఆయన ఏకంగా ఓ వ్యవస్థనే ఏర్పాటు చేసుకున్నాడు. తనకు కావాల్సిన అమ్మాయిని ఒప్పించే విధంగా విషకన్యలు అనే గ్రూప్‌ ఉండేది. ఈ బృందంలోని మహిళలు డేరాలోని అందమైన యువతులను తమ వలలో వేసుకునే వారు. రామ్ రహీం అంతరంగ మందిరానికి తీసుకు వెళ్లే వారు. ఈ విషకన్యలు గుర్మీత్‌ సింగ్‌ కు అత్యంత సన్నిహితంగా మెలుగుతుంటారు. వీరంతా గతంలో సాధ్వీలుగా డేరాలో ఉన్నవారే.

తన పేరు బయట పెట్టొద్దంటూ ఇటీవల మరొక యువతి డేరాలో జరుగుతున్న విషయాలను బయటపెట్టింది .. యువతులకు మాయమాటలుచెప్పి బాబా ఆశీర్వాదంతో పవిత్రులై పోతారంటూ నమ్మబలికే వారు. రాత్రి పదకొండు గంటలకు యువతులను ఆంతరంగిక మందిరంలోకి పిలిచేవారు.. యువతులు ఎవరైనా ఎదురు తిరిగితే వారికి 24 గంటల పాటు నీరు, ఆహారం ఇవ్వరు. కుర్చీల్లో కట్టేసి కొట్టటంతో పాటు కోపంగా చూసే యువతుల ముఖంపై మసిపూసి గాడిదలపై ఊరేగించే వారు.ఆంతరంగిక మందిరంలో ఏం జరిగిందో బయటకు చెప్తే కుటుంబాన్ని కూడా చంపేస్తామని భయపెట్టేవారు.ఏం చేయాలో పాలుపోక బాబాకి లొంగిపోయేవాళ్లం అని..బాబా నుండి తప్పించుకోవాడానికి చాలామంది ఒకసారి పీరియడ్స్ అని చెప్పి,క్షమించాలని చెప్పగానే ఆంతరంగిక మందిరం నుండి బయటకు పంపేసేవారట..తర్వాత తను బయటికి వచ్చి మిగతా యువతులకు ఈ రీజన్ చెప్పమంటే..చాలామంది పీరియడ్స్ అని చెప్పి బాబా చెరను ఆ పూటకు తప్పించుకునేవారని చెప్పుకొచ్చింది..ఇంకా ఎన్ని అకృత్యాలు బయటపడతాయో..

Comments

comments

Share this post

scroll to top