డేరాబాబా పర్సనల్ రూంలో ఏం ఉందో తెలుసా.? బీరువాలోనుండి వెళ్తే…ఆడపిల్లల గదులలోకి రహస్య మార్గాలు!

కుల వివక్ష తీవ్రంగా ఉండే పంజాబ్‌, హర్యానా లోని దళితులు, వెనుకబడిన వర్గాలను ఏకం చేసిన సామాజిక, ఆధ్యాత్మిక జీవన విధానమే డేరా స్వచ్ఛ సౌదా. 1950 దశకం చివర్లో మొదలైన ఈ మతంలో సామాజిక, కుల అంతరాలను భరించలేని గిరిజన, దళిత, బీసీలు లక్షలాదిగా ఇందులో జాయినయ్యారు. ఒకరకంగా అది జీవన స్థైర్యాన్నిచ్చింది వారికి. నిజానికి డేరా సౌదా ఒక ఆదర్శనీయ సమాజాన్ని ప్రవచిస్తుంది. ఇందులో ధన, కుల బేధాలుండవు. అనేక ఆహార సదుపాయాలు, ఆసుపత్రులు, విద్యాలయాలు, కుటీర పరిశ్రమలతో ఇది సభ్యులకు సేవ చేస్తోంది. దీన్ని మరింత ఎత్తులకు తీసుకెళ్లాడు గుర్మీత్ డేరా. డేరాబాబా అలియాస్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఆధ్యాత్మిక గురువు అత్యాచార కేసులో సిబిఐ కోర్టు దోషిగా నిర్ధారించింది.

డేరా సచ్చా సౌధాలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నట్టు 15 ఏళ్ల క్రితం ఓ గుర్తు తెలియని సాధ్వి  లేఖే గుర్మీత్‌ సింగ్‌కు శిక్ష పడడంలో ప్రధాన పాత్ర పోషించింది. అతని సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో కబళించింది.ఆ లేఖలో అజ్ణాత సాధ్వి డేరా స్వఛ్చసౌదాలో జరుగుతున్న అకృత్యాలు అన్నింటిని బయటపెట్టింది. ఇప్పుడు డేరాబాబా కటకటాల్లో ఊచలు లెక్కపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే అతని ఆశ్రమం లో ఇతర క్లూ ల కోసం , విషయాల కోసం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న పోలీసులకి కొత్త కొత్త  విషయాలు తెలిసాయి.ఆశ్రమంలో రామ్ రహీం ఓ అల్మరా నుంచి రహస్య మార్గం ద్వారా అమ్మాయిలు ఉన్న గదుల్లోకి వెళ్లేందుకు మార్గాలను నిర్మించుకున్నాడని కనిపెట్టారు.

చిన్న చిన్న ఆడపిల్లలని అందరినీ విడివిడిగా గదులలో పెట్టె డేరా బాబా వారి గదుల్లో రహస్య తలుపులు పెట్టాడు. అల్మారా గుండా వెళితే వారి గదుల్లోకి గుర్మీత్ వెళ్లవచ్చని తేల్చారు. రహస్యంగా వచ్చిపోయేందుకే ఆయన ఈ మార్గాన్ని నిర్మించుకున్నాడని ఓ అధికారి తెలిపారు.ఆ ఆశ్రమం లో ఇప్పటి వరకూ ఉంటున్న ప్రతీ ఆడపిల్లనీ స్వస్థలాలకి పంపేసిన పోలీసులు మొత్తం ఆశ్రమం లో డబ్బులు, బంగారం వెలికితీసే పనిలో పడ్డారు.

watch video here:

https://www.youtube.com/watch?v=__T9JXB3iso

Comments

comments

Share this post

scroll to top