డేరా బాబా జైలులో…అతని శిష్యుడు సెక్స్ రాకెట్ నడిపిస్తూ..చివరికి పోలీసులు పట్టుకుందామంటే ఏమైందంటే.?

డేరా బాబా.. రామ్‌ రహీమ్‌ సింగ్‌.. గుర్మీత్‌ సింగ్‌… పేరెలా పిలిచినా అతను ఇప్పుడు గతం.. అది అయిపోయిన ముచ్చట. ఆశ్రమంలో తాను కోరుకున్న అమ్మాయిలను లోబర్చుకున్న డేరా బాబా ఇప్పుడు జైలులో ఊచలు లెక్కబెడుతున్నాడు. ఇక అతని అనుచర గణం అడ్రెస్‌ లేరు. ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో తెలియదు. కానీ తాజాగా డేరా బాబాకు చెందిన ఓ శిష్యుడు మాత్రం తన గురువు చేసిన పనే చేస్తున్నాడు. అది చాలా లాభసాటి వ్యాపారం అనుకున్నాడో ఏమో తెలియదు కానీ.. ఏకంగా ఓ భవనంలో అమ్మాయిలతో వ్యభిచారం స్టార్ట్‌ చేశాడు. అయినా చెడ్డ పని చేస్తే అది ఎన్నటికీ గుట్టుగా ఉండదు కదా. కచ్చితంగా ఎవరికైనా తెలుస్తుంది. చివరకు అదే జరిగింది. దీంతో పోలీసుల రైడ్‌లో ఆ డేరా బాబా శిష్యుడి గుట్టు తెలిసిపోయింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే…

డేరా బాబాకు ఓ అనుంగు శిష్యుడు ఉండేవాడు. అతను పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా బుర్రా బజార్‌లో ఉన్న తన బిల్డింగ్స్‌లో వేశ్యా గృహాలను నిర్వహించడం ప్రారంభించాడు. అందుకు గాను అతను ఆ భవనంలో ఏకంగా చెక్కలతో 25 క్యాబిన్లను ఏర్పాటు చేశాడు. వాటిల్లో అమ్మాయిలను ఉంచి వారితో వ్యభిచారం చేయించేవాడు.

అయితే సదరు క్యాబిన్లలో స్త్రీ, పురుషులు అసభ్యకరంగా కనిపిస్తుండడంతో చుట్టూ ఉండే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఆ భవనంపై దాడి చేశారు. అందులో వ్యభిచారం చేస్తున్న స్త్రీలు, పురుషులను అరెస్టు చేశారు. అయితే అప్పటికే సదరు డేరా బాబా శిష్యుడు తన శిష్యురాలితో అక్కడి నుంచి ఉడాయించాడు. ఆ భవనం నుంచి కింది భాగంలో ఉండే ఓ సొరంగ మార్గంలో అతను తప్పించుకున్నాడు. దీంతో పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు..! ఇక పోలీసులు అతన్ని పట్టుకుంటారో లేదో వేచి చూడాలి. ఏది ఏమైనా ఈ మధ్య ఇలాంటి బాబాల చేష్టలు ఎక్కువయ్యాయి కదా..!

Comments

comments

Share this post

scroll to top