దేశ ప్రతిష్ట కోసం ప్రాణాలను లెక్కచేయని దీపకు హ్యాట్సాఫ్. ఒళ్లు జలదరించే వీడియో.!

ఇండియా నుండి జిమ్నాస్టిక్ ప్లేయరా? అని పిచ్చలైట్ గా తీసుకున్నోళ్ళందరికీ ఇప్పుడామె ఓ టెర్రర్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జిమ్నాస్టిక్ ప్రేక్షకులంతా ఇప్పుడు ఆమెకు పెద్ద ఫ్యాన్స్. ఆమె చేసే విన్యాసాలను ప్రపంచమంతా ఊపిరిబిగబట్టి చూస్తుంది. ఆమే భారతదేశానికి చెందిన దీప కర్మాకర్. ఒలంపిక్స్ లో మన దేశ పతక ఆశాలను మోస్తున్న ఆశాకిరణం. ఇండియా నుండి జిమ్నాస్టిక్ ఫైనల్ కు అర్హత సాధించిన తొలి క్రీడాకారిణి. ఇదంతా ఒక ఎత్తు అయితే నిన్న ఆమె చేసిన ప్రొడునోవా ఫీట్ ఓ ఎత్తు. ప్రాణాలను పణంగా పెట్టి మరీ మన దేశ ప్రతిష్ట కోసం దీప చేసిన విన్యాసం భారతీయులందర్నీ గర్వపడేలా చేసింది.
 
ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ వాల్ విభాగంలోని క్వాలిఫైయింగ్ రౌండ్ లో పాల్గొన్న దీప తన తొలి ప్రయత్నంలోనే ప్రొడునోవా ను చేసింది. ఇది జిమ్నాస్టిక్ విభాగంలోనే అత్యంత క్లిష్టమైన విన్యాసం.దీనిని చేయడానికి ప్రయత్నించే ప్రాన్స్ కు చెందిన జిమ్నాస్ట్ తన కుడికాలును విరగొట్టుకున్నాడు. ఇక మహిళా జిమ్నాస్ట్స్ అయితే…ఆ విన్యాసం జోలికి కూడా వెళ్లరు. అలాంటి సమయంలో రిస్క్ అని తెలిసినప్పటికీ కూడా దీప…ప్రొడునోవా విన్యాసాన్ని చేసింది. ఆమె గాలిలో రౌండ్స్ కొట్టేటప్పుడు చాలా మంది గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి.. ఎందుకంటే ల్యాండిగ్ సరిగ్గా అవుతుందా.? లేదా? ఏదైనా తేడా వస్తే ప్రాణాలకే ప్రమాదం. కానీ భారతీయుల ఆశల్ని నిజం చేస్తూ ఆమె విజయవంతంగా ఈ విన్యాసాన్ని చేసింది. వాల్ట్ ఈవెంట్ లో ఈ ఫీట్ కు అధిక పాయింట్స్ ఉంటాయి.
 
ఓ సారి ఈ వీడియో చూస్తే తెలుస్తుంది దీప దేశ ప్రతిష్ట కోసం ఎంతటి రిస్క్ చేసిందో.. దీపను అభినందించి ప్రోత్సాహించాల్సిన బాధ్యత మనమీదుంది. ఆల్ ది బెస్ట్ దీప.

Watch Video:

దీప గురించిన మరింత సమాచారం: CLICK  : HERE

13957580_1071992319505219_698052318_n

Comments

comments

Share this post

scroll to top