పోయిన సంవత్సరం రద్దైన పెద్ద నోట్లను ఇప్పుడు “సౌత్ ఆఫ్రికా” ఎన్నికల్లో వాడుతున్నారు..! ఎందుకో తెలుసా.?

నోట్ల ర‌ద్దు వ‌ల్ల ఇప్ప‌టికే ఎన్నో ల‌క్ష‌ల కోట్ల పాత క‌రెన్సీ ఆర్‌బీఐ వ‌ద్ద‌కు చేరుకుంద‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ పాత నోట్ల‌తోపాటు కొత్త నోట్ల‌ను పెట్టేందుకు కూడా ఆర్‌బీఐ బ్రాంచుల్లో స్థ‌లం మిగ‌ల‌డం లేద‌ట‌. దీంతో పాత నోట్ల‌ను కాల్చేయాల‌ని ఆర్‌బీఐ నిర్ణ‌యించుకుంది. అయితే అలా కాకుండా ఆ నోట్ల‌ను రీసైకిల్ చేసి మ‌రో ప‌నికోసం వినియోగిస్తే త‌ద్వారా ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించిన‌ట్టు అవుతుందని ఓ సంస్థ ఆలోచించింది. దీంతో ఆ నోట్ల‌ను ఆ సంస్థ కొనుగోలు చేస్తోంది. త‌ద్వారా వాటిని వేరే దేశంలో ఓ పనికోసం వినియోగించ‌నున్నారు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. మ‌న దేశ పాత క‌రెన్సీని రీసైకిల్ చేసి మ‌రో దేశంలో వాటిని వేరే రూపంలో వాడ‌నున్నారు. అదెలాగంటే…

నోట్ల ర‌ద్దు వ‌ల్ల మొత్తం 800 ట‌న్నుల బ‌రువు గ‌ల పాత నోట్లు తిరువ‌నంత‌పురం ఆర్‌బీఐ బ్రాంచ్‌కు వ‌చ్చాయ‌ట‌. అయితే వాటిని కాల్చేస్తే ఉప‌యోగం ఉండ‌ద‌ని భావించిన వెస్ట‌ర్న్ ఇండియా ప్లైవుడ్స్ (డ‌బ్ల్యూఐపీ) సంస్థ ఆ నోట్ల‌ను కొనుగోలు చేసేందుకు ముందుకు వ‌చ్చింది. వాటిని రీసైకిల్ చేసి వేరే రూపంలోకి మార్చి ఉప‌యోగిస్తామ‌ని ఆర్‌బీఐకి చెప్ప‌డంతో ఆర్‌బీఐ ఆ నోట్ల‌ను ఒక ట‌న్నుకు గాను రూ.128ల‌కు డ‌బ్ల్యూఐపీ కంపెనీకి విక్ర‌యించింది. దీంతో ఇప్పుడా నోట్ల‌ను ఆ కంపెనీ రీసైకిల్ చేస్తోంది. మ‌రి రీసైకిల్ చేసిన నోట్ల‌తో ఏమేం త‌యారు చేయ‌నున్నారు, ఎక్క‌డ వాటిని వాడ‌నున్నారో తెలుసా..?

పైన చెప్పిన డ‌బ్ల్యూఐపీ కంపెనీ ఆర్‌బీఐ నుంచి నోట్ల‌ను తీసుకున్నాక వాటిని రీసైకిల్ చేయ‌నుంది. ఆ ప్ర‌క్రియ ఎలా చేస్తారంటే నోట్లు ఆర్‌బీఐ నుంచి చిరిగిపోయి వ‌స్తాయి, ఆ త‌రువాత వాటిని పెద్ద పెద్ద స్టీల్ చాంబ‌ర్‌ల‌లో వేసి కుకింగ్ చేస్తారు. అధిక ఉష్ణోగ్ర‌త‌ల వ‌ద్ద నోట్ల‌ను వేడి చేస్తారు. దీంతో ఆ నోట్ల నుంచి ప‌ల్ప్‌ను వేరు చేస్తారు. ఆ త‌రువాత ప‌ల్ప్‌ను డిఫిబ్రిలేట‌ర్ స‌హాయంతో గ‌ట్టిగా అయ్యేలా చేస్తారు. దాంతో హార్డ్ బోర్డుల‌ను త‌యారు చేస్తారు. అలా త‌యారైన హార్డ్ బోర్డుల‌తో ప్ల‌కార్డులు చేస్తారు. లేదంటే హోర్డింగ్‌లు చేస్తారు. ఇక ఆ ప్ల‌కార్డుల‌ను, హోర్డింగ్‌ల‌ను సౌతాఫ్రికాకు త‌ర‌లిస్తారు. అక్కడ వాటిని 2019లో జ‌ర‌గ‌నున్న ఎల‌క్ష‌న్ల‌లో వాడనున్నారు. అదీ.. మ‌న పాత నోట్ల భ‌విష్య‌త్‌..!

Comments

comments

Share this post

scroll to top