వెరైటీ గా రన్ అవుట్ అయిన “రాయుడు”..! చూసి నవ్వాపుకోలేకపోయిన “బ్రేవో” [VIDEO]

చెన్నై సూపర్ కింగ్స్ జ‌ట్టులో కీలక ఆట‌గాడిగా ఉన్న అంబటి రాయుడు ఈ సీజ‌న్‌లో ఎన్న‌డూ లేనంత‌గా అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నాడు. ప్ర‌తి మ్యాచ్‌లోనూ త‌న దైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ జ‌ట్టు విజ‌యాల్లో కీల‌కపాత్ర పోషిస్తున్నాడు. దీంతో చెన్నై జ‌ట్టు ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో అగ్ర‌స్థానంలో ఉంది. అయితే ఇటీవ‌ల ఢిల్లీ, చెన్నై జ‌ట్ల మ‌ధ్య‌ జ‌రిగిన మ్యాచ్‌లో అంబ‌టి రాయుడు కామెడీగా ర‌న్ అవుట్ అయ్యాడు. దీంతో ఇప్పుడ‌త‌ని వీడియో వైర‌ల్‌గా మారింది.

ఐపీఎల్‌లో ఇటీవ‌లే ఢిల్లీ, చెన్నై జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ్గా అందులో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో చెన్నై భారీ స్కోరు సాధించడంలో ధోని, రాయుడు కీలకపాత్ర పోషించారు. వీరిద్దరూ కలిసి ఆరు ఓవర్లలో 79 పరుగులు రాబట్టారు. అయితే ఆఖరి ఓవర్లో అప్పటివరకు దూకుడుగా ఆడిన అంబటి రాయుడు 41 పరుగుల వద్ద అనూహ్యంగా రనౌటయ్యాడు. చెన్నై బ్యాటింగ్ చేస్తుండ‌గా ఆ జ‌ట్టు ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్‌ను ఢిల్లీ బౌల‌ర్‌ ట్రెంట్ బౌల్ట్ వేశాడు. ఆఖరి ఓవర్లో ఐదో బంతిని ఎదుర్కొన్న చెన్నై కెప్టెన్ ధోని పుల్ షాట్‌గా ఆడాడు. అయితే అది బ్యాట్ కు త‌గ‌ల‌కుండా ఎడ్జ్ తీసుకుని వెన‌క్కి వెళ్లింది. దీంతో ఆ బంతిని కీప‌ర్ రిషబ్ పంత్ ప‌ట్టుకున్నాడు.

కానీ మ‌రో వైపు బౌల‌ర్ ఎండ్‌లో క్రీజులో ఉన్న రాయుడు ఆ విష‌యాన్ని గ‌మ‌నించ‌లేదు. ర‌న్‌కు య‌త్నించాడు. కానీ ధోనీ మాత్రం క‌ద‌ల్లేదు. దీంతో రాయుడు ధోనీ వ‌ర‌కు వెళ్లాడు. అప్ప‌టికి రాయుడికి విష‌యం తెలిసింది. దీంతో మ‌ళ్లీ వెంట‌నే వెన‌క్కి ప‌రిగెత్తాడు. ఆ స‌మ‌యంలో బంతిని అందుకున్న బౌల‌ర్ ట్రెంట్ బౌల్ట్ వికెట్ల‌కు బంతిని గురి చూసి కొట్ట‌డంతో రాయుడు ర‌నౌట్ అయ్యాడు. దీంతో రాయుడి రనౌట్ చెన్నై జట్టులో నవ్వులు పూయించింది. ఈ మొత్తం తతంగాన్ని డగౌట్‌లో నుంచి చూస్తున్న చెన్నై ఆటగాళ్లు న‌వ్వు ఆపుకోలేక‌పోయారు. రాయుడి రనౌట్‌ చూసి బ్రావో అయితే పగలబడి నవ్వాడు. కాగా ఈ ర‌నౌట్‌కు చెందిన వీడియోను బీసీసీఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో అభిమానులతో పంచుకుంది. ఈ క్ర‌మంలో ఆ వీడియో కాస్తా వైర‌ల్ అయింది. అయితే ఆ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ పై చెన్నై సూపర్‌ కింగ్స్‌ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో ఢిల్లీ పోరాడి ఓడింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 198 పరుగులు మాత్ర‌మే చేయ‌గా చెన్నై విజ‌యం సాధించింది.

Watch Video :

 

Comments

comments

Share this post

scroll to top