మాదేశానికి మా అవసరం ఉందంటూ వీదేశీ కంపెనీ ఆఫర్ చేసిన కోటి రూపాయల ప్యాకేజీని కాదన్న నలుగురు IIT కుర్రాళ్ళు.!

ఢిల్లీ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT) క్యాంపస్ లో ఇంటర్వ్యూలు జరుగుతున్నాయ్,  వివిధ దేశాలకు చెందిన 8 పెద్ద పెద్ద కంపెనీలు రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నాయ్. చాలా మందికి  ప్లేస్ మెంట్ ఇచ్చి ప్యాకేజీ ఫిక్స్ చేసుకుంటున్నారు కంపెనీ ప్రతినిధులు.  అందులో నలుగురు కుర్రాళ్లకు యేడాదికి కోటికి పైగా ప్యాకేజ్ ఇస్తాం అంటూ భారీ ఆఫర్ ను ప్రకటించింది ఓకంపెనీ.. ఉద్యోగమే కష్టతరమైన ఇలాంటి సమయంలో  ఓ భావి ఇంజనీర్ కు ఇంతకన్నా కావాల్సిందేముందీ… కోటి రూపాయలంటే కళ్ళు మూసుకొని జాబ్  జాయిన్ అయిపోరు…!! కానీ ఈ నలుగురు కుర్రాళ్లు మాత్రం కోటిరూపాయలు ఇస్తానన్న జాబ్ కు  నో అని చెప్పేశారు..! అదేంటీ కోటి రూపాయల జీతం అన్నారు… కంపెనీ ప్రతినిధులు…

అయినా, సారీ సార్ మేం చేయలేం అంటూ ఖరాఖండిగా చెప్పేశారు ఆ నలుగురు కుర్రాళ్లు… మేం మా ప్రతిభను విదేశీ కంపెనీల ఎదుగుదలకు వాడాలనుకోవడం లేదు.. మా అవసరం మాదేశానికి చాలా ఉంది. ఇక్కడి చదువును ఇక్కడి అభివృద్దికే ఉపయోగిస్తాం. మీరు ఇస్తా అన్న కోటి రూపాయల ప్యాకేజీ కన్నా.. మేక్ ఇన్ ఇండియా అనే నినాదమే మాకు నచ్చింది. అందుకే ఇక్కడే ఉంటాం …మా ఆలోచనలకు అనుగుణంగా మేమే ఓ కంపెనీ పెట్టుకుంటాం అని తేల్చి చెప్పారు ఈ నలుగురు  ఇంటెలీజెంట్ ఇంజనీర్స్.

02TH_IIT_PHOTO_2229737f

సాధారణ కాలేజ్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు సైతం డాలర్ కలలు కంటూ…పట్టా చేత పడగానే ప్లైట్ ఎక్కి విదేశాలకు వెళుతున్న ఈ తరుణంలో… IIT లో చదివి, కోటి రూపాలయ ప్యాకేజీ కాలిగోటికి సమానం అంటూ కొట్టిపారేసి దేశసేవే మా లక్ష్యం అన్న ఈ కుర్రాళ్లు నిజంగా అభినందనీయులు.

Comments

comments

Share this post

scroll to top