త‌ల్లిదండ్రుల ఇంట్లో ఉండే హ‌క్కు కొడుకుల‌కు లేదు… ఢిల్లీ హైకోర్టు తీర్పు..!

పెళ్ల‌యినా, కాకున్నా కొంద‌రు మ‌గ‌వారు త‌మ త‌ల్లిదండ్రుల ద‌గ్గ‌రే ఉంటుంటారు. వారి పంచ‌నే ఉండ‌డ‌మే కాదు, ఇంకా కొంద‌రైతే ఏ ప‌నీ చేయ‌కుండా బ‌లాదూర్ తిరుగుతూ త‌ల్లిదండ్రులనే ఇబ్బందుల‌కు గురి చేస్తుంటారు. అయితే ఇక‌పై ఇలాంటి వారి ప‌ట్ల త‌ల్లిదండ్రులు ద‌య చూపాల్సిన అవ‌స‌రం లేదు. వారిని నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌గొట్ట‌వ‌చ్చు. అలాంటి వారి ప‌ట్ల చ‌ట్టం కూడా క‌ఠినంగా ఉండ‌నుంది. అందుకు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఓ తీర్పే ఉదాహ‌ర‌ణ‌.

delhi-high-court
ఈ మ‌ధ్యే ఢిల్లీ హైకోర్టులో ఓ కుటుంబానికి చెందిన కేసు విచార‌ణ‌కు వ‌చ్చింది. పిటిష‌న‌ర్ అందులో ఏమ‌న్నాడంటే… త‌ల్లిదండ్రుల ఇంట్లో కొడుకు ఉండ‌వ‌చ్చ‌ని, అందుకు త‌ల్లిదండ్రుల ప‌ర్మిష‌న్ అవ‌స‌రం లేద‌ని, అది ఓ హ‌క్కు అని పేర్కొన్నాడు. అయితే వాద ప్ర‌తివాద‌న‌లు విన్న పిద‌ప కోర్టు ఏమ‌ని తీర్పు ఇచ్చిందంటే… కొడుకుల‌కు త‌ల్లిదండ్రుల ఇంట్లో ఉండే హ‌క్కు ఉండ‌ద‌ట‌. వారు ద‌య త‌లిస్తే ఉండ‌వ‌చ్చ‌ట‌. లేదంటే లేదు.

అమ్మానాన్న‌లు పూర్తిగా అనుకూలంగా ఉండి, వారికి ఇష్టం అయితేనే కొడుకులు వారింట్లో ఉండ‌వ‌చ్చ‌ట‌. లేదంటే కొడుకుల‌కు వారి ఇంటి ప‌ట్ల ఎలాంటి హ‌క్కు ఉండ‌ద‌ట‌. కొడుకు వివాహితుడు అయినా, అవివాహితుడు అయినా కేవ‌లం త‌ల్లిదండ్రుల ద‌య‌తోనే, వారు ఓకే అంటేనే ఇంట్లో ఉండ‌వ‌చ్చ‌ట‌. త‌ల్లిదండ్రులు క‌ష్టార్జితం చేసి సంపాదించిన ఇంటిపై కొడుకుల‌కు ఎలాంటి హక్కు ఉండ‌ద‌ని కోర్టు తేల్చి చెప్పింది. అంతే క‌దా మ‌రి… అమ్మానాన్న‌ల‌ను ప‌ట్టించుకోకుండా గాలికొదిలేసే కొడుకుల‌కు ఇలా జ‌ర‌గాల్సిందే. ఏది ఏమైనా, కోర్టు ఇచ్చిన తీర్పు కొంద‌రికి చెంప పెట్టు లాంటిది. మ‌రి ఈ విష‌యంలో మీరేమంటారు..?

Comments

comments

Share this post

scroll to top