పోరాడిన రెహానే..ర‌ఫ్పాడించిన పంత్ – నిలిచిన ఢిల్లీ

ఐపీఎల్ టోర్న‌మెంట్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టుతో జ‌రిగిన మ్యాచ్‌లో గెల‌వాల్సిన చోట చేజేతులారా ఓట‌మిని మూట‌గ‌ట్టుకుంది రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు. ఢిల్లీ జ‌ట్టులో శిఖ‌ర్ ధావ‌న్ ప్రారంభం నుంచే దుమ్ము రేపాడు. శిఖ‌ర్‌కు రిష‌భ్ పంత్ జ‌త క‌ట్టి ..రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌ను చెడుగుడు ఆడుకున్నారు. భారీ స్కోర్‌ను రాజ‌స్థాన్ జ‌ట్టు సాధించింది. ఈ టార్గెట్ చేధ‌న‌లో డీసీ జ‌ట్టు స‌క్సెస్ అయ్యింది. కీల‌క స‌మ‌యంలో వికెట్ల‌ను పారేసుకుంటున్న డిసి జ‌ట్టు ఈసారి ఆ త‌ప్పిదం చేయ‌లేదు. వికెట్ల‌ను కాపాడుకుంటూనే మ‌రో వైపు ల‌క్ష్యాన్ని చేరుకునే ప్ర‌య‌త్నం చేశారు. రాజ‌స్థాన్‌తో గెలుపొంద‌డంతో టోర్నీలో ఏడు విజ‌యాలు న‌మోదు చేసుకుంది. టాప్‌లో నిలిచింది. ఇక రాజ‌స్థాన్ జ‌ట్టులో కెప్ట‌న్ ప‌ద‌విని కోల్పోయిన అజింక్యా రెహానే అత్య‌ద్భుత‌మైన ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించాడు. అజేయంగా సెంచ‌రీ సాధించాడు.

అయినా జ‌ట్టును కాపాడలేక పోయాడు. ఆ జ‌ట్టు బౌల‌ర్లు పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంతో ఓట‌మి కొనితెచ్చుకున్నారు.మైదానంలోకి దిగిన రిష‌బ్ బంత్ బౌల‌ర్ల భ‌ర‌తం ప‌ట్టాడు. 36 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న ఈ ఆట‌గాడు ఆరు ఫోర్లు ..నాలుగు సిక్స‌ర్ల‌ను బాదాడు. 78 విలువైన ప‌రుగులు చేసి ఆట ఆఖ‌రు వ‌ర‌కు నిలిచాడు. పంత్‌కు తోడుగా శిఖ‌ర్ ధ‌వ‌న్ 27 బంతులు ఆడి ఎనిమిది క‌ళ్లు చెదిరే ఫోర్లు, రెండు భారీ సిక్స‌ర్ల‌తో 54 ప‌రుగులు చేశాడు. దీంతో ఢిల్లీ కేపిట‌ల్స్ జ‌ట్టు రాజ‌స్థాన్ పై ఆరు వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. పాయింట్ల ప‌ట్టిక‌లో 14 పాయింట్ల‌తో అగ్ర స్థానానికి ఎగ‌బాకింది. టాస్ గెలిచి రాజ‌స్థాన్ జ‌ట్టు ముందు బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 ప్ర‌ధాన వికెట్ల‌ను కోల్పోయి 191 ప‌రుగులు చేసింది. ఓ ర‌కంగా చూస్తే టోర్నీలో ఇది భారీ స్కోరు. ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు బౌల‌ర్లకు చుక్క‌లు చూపించాడు..ర‌హానే. క‌సి మీద ఆడాడు.

బంతుల్ని ఫోర్లు, సిక్స‌ర్లుగా మార్చాడు. ఏ ఒక్క బౌల‌ర్‌ను విడిచి పెట్ట‌లేదు. కేవ‌లం 63 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న ఈ క్రికెట‌ర్ 11 ఫోర్లు, 3 భారీ సిక్స‌ర్ల‌ను బాదాడు. 105 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కెప్టెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన స్టీవ్ స్మిత్ 32 బంతులు ఆడి 8 ఫోర్ల‌తో 50 ప‌రుగులు చేసి రాణించాడు. ర‌బాడా ఒక్క‌టే రెండు వికెట్లు తీశాడు. ఆ త‌ర్వాత రంగంలోకి దిగిన 19.2 వికెట్లు కోల్పోయి 4 వికెట్లు కోల్పోయి 193 ప‌రుగులు చేసి గెలుపొందింది. ఇరు జ‌ట్ల మ‌ధ్య నువ్వా నేనా అన్న రీతిలో మ్యాచ్ కొన‌సాగింది. ఆఖ‌రున పృథ్వీ షా రాణించి..జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించ‌డంతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ద‌క్కించుకున్నారు. షా ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను ట‌ర్న‌ర్ వ‌దిలేశాడు. ఈ ఒక్క పొర‌పాటు రాజ‌స్థాన్ ఆట తీరును మార్చేసింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్య‌ర్‌ను ప‌రాగ్ అవుట్ చేశాడు.

ప్ర‌మాద‌క‌రంగా త‌యారైన ధ‌వ‌న్‌ను గోపాల్ ఇంటికి పంపించాడు. ఆ ద‌శ‌లో బ‌రిలో ఉన్న పంత్, షా లు క‌లిసి రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌ను ఆటాడుకున్నారు. అంత‌కు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజ‌స్థాన్ జ‌ట్టులో ర‌హానే దుమ్ము రేపాడు. రెండో ఓవ‌ర్‌లోనే సంజూ శాంస‌న్ ర‌నౌట్ అయినా ఆ లోటు క‌నిపించ‌నీయ‌లేదు. చ‌క్క‌టి స్ట్రోక్ ప్లేతో ఆక‌ట్టుకున్నాడు. ఐదో ఓవ‌ర్‌లో ఇషాంత్ క్యాచ్ వ‌దిలి వేయ‌డంతో ఇక వెనుతిరిగి చూడ‌లేదు. ఢిల్లీ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు ర‌హానే , స్మిత్‌లు. రెండో వికెట్‌కు వీరిద్ద‌రు క‌లిసి 130 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. చివ‌రి ఏడు ఓవ‌ర్ల‌లో కేవ‌లం 56 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌డంతో స్కోర్ మెల్ల‌గా సాగింది. 10 మ్యాచ్‌లు ఆడిన రాజ‌స్థాన్ జ‌ట్టు ప్లే ఆఫ్ ఆశ‌లు స‌న్న‌గిల్లిన‌ట్టే అనుకోవాలి. క్రికెట్ జ‌ట్టు ఫ్యాన్స్ తీవ్ర నిరాశ‌కు లోన‌య్యారు.

Comments

comments

Share this post

scroll to top