ఐపీఎల్ టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తన ఆటతీరును మార్చుకుంది. మెల మెల్లగా గెలుస్తూ ..మరో మ్యాచ్ ఆడి గెలిస్తే ప్లే ఆఫ్ పై ఆశలు పెట్టుకోవచ్చు. పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో విజయం వరించింది. బౌలింగ్ పరంగా సందీప్ 40 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీస్తే..కాగిసో రబాడా 23 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ 22 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే శిఖర్ ధావన్ దుమ్ము రేపాడు. కేవలం 41 బంతులు మాత్రమే ఆడిన ఈ క్రికెటర్ 7 ఫోర్లు ఒక సిక్సర్ తో 56 పరుగులు చేశాడు. మరో వైపు శ్రేయస్ అయ్యర్ 49 బంతులు ఆడి అయిదు ఫోర్లు ..భారీ సిక్సర్‌తో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 5 వికెట్లు తేడాతో పంజాబ్ పై గెలిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 163 పరుగలు మాత్రమే చేసింది.
మైదానంలోకి దిగిన పంజాబ్ ఆటగాళ్లు మొదటి నుండి ఆఖరు వరకు బ్యాట్స్‌మెన్స్ పరుగులు తీసేందుకు నానా తంటాలు పడ్డారు. వెస్టీండీస్ ఆటగాడు..పంచ్ హిట్టర్‌గా పేరొందిన క్రిస్ గేల్ ఒక్కడే ఈ జట్టులో మెరుగైన ఆటతీరును ప్రదర్శించారు. తక్కువ బంతులు మాత్రమే ఆడిన ఈ క్రికెటర్ స్టేడియం నలువైపులా బంతులు బాదాడు. 37 బంతులు ఆడి ఆరు ఫోర్లు 5 సిక్సర్లతో 69 పరుగులు చేశాడు. మిగతా క్రికెటర్లు ఎవరూ ఢిల్లీ బౌలర్లను ఎదుర్కోలేక చతికిలపడ్డారు. ఒక్కో పరుగు చేసేందుకు కూడా నానా ఇబ్బందులు పడ్డారు. అంతకు ముందు టార్గెట్‌ను ఛేధించేందుకు రంగంలొకి దిగిన ఢిల్లీ జట్టు ఇంకా ఒక బంతి మాత్రమే ఉండగా 5 వికెట్లు కోల్పోయి పంజాబ్‌పై గెలుపు సాధించింది.
చివర్లో ఎవరు గెలుస్తారోననే ఉత్కంఠ రేగింది. బరిలోకి దిగిన బ్యాట్స్ మెన్ పృథ్వీ షా 13 పరుగులు మాత్రమే చేసి త్వరగా పెవిలియన్ బాట పట్టాడు. ధావన్, అయ్యర్ నిలకడగా ఆడారు. మెల మెల్లగా స్కోరును పెంచారు. 13 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ జట్టు కేవలం ఒక్క వికెట్ కోల్పోయి 111 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. ఆ తర్వాతి ఓవర్లో ధావన్ అవుటయ్యాడు. కాసేపటికే పంత్ ఆరు పరుగులు చేసి వెనుదిరిగాడు. మైదానంలోకి వచ్చిన ఇంగ్రామ్ 9 బంతులు ఆడి నాలుగు ఫోర్లు బాది 19 పరుగులు చేశాడు. రెండు ఓవర్లు మిగిలడం..పది పరుగుల చేయాల్సి రావడంతో టెన్షన్ నెలకొంది. 19 ఓవర్లో షమీ ఇంగ్రాంను అవుట్ చేశాడు. అక్షర్ రనౌట్ కావడంతో ..ఎవరు గెలుస్తారనేది టెన్షన్ రేపింది. చివరి ఓవర్లో 3 బంతులకు నాలుగు పరుగులు మాత్రమే వచ్చాయి. నాలుగో బంతిని ఫోర్ కొట్టడంతో ఢిల్లీ విజయం సాధించింది.