“ప్లే స్టోర్” లో నుండి గూగుల్ ఈ 22 యాప్స్ డిలీట్ చేసింది..! మీ ఫోన్ లో నుండి వెంటనే తీసేయండి. లేందంటే?

గూగుల్‌ ప్లే స్టోర్‌.. ఆండ్రాయిడ్‌ ఫోన్లను వాడేవారందరికీ దీని గురించి తెలుసు. కొన్ని కోట్ల యాప్స్‌ ఇందులో మనకు లభిస్తున్నాయి. ఎడ్యుకేషన్‌, గేమ్స్‌, బుక్స్‌, వాల్‌ పేపర్స్‌, మూవీస్‌, మెసెంజర్స్‌… ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వేల విభాగాలకు చెందిన యాప్స్‌ మనకు గూగుల్‌ ప్లే స్టోర్‌లో లభిస్తున్నాయి. అయితే ఈ ప్లే స్టోర్‌లో ఉన్న యాప్స్‌ అన్నీ నిజానికి సేఫ్‌ కాదు. వాటిలో కేవలం కొన్ని మాత్రమే సేఫ్‌. మిగిలినవి అంత సేఫ్‌ కాదు. అంటే.. ఆ యాప్స్‌ను వాడితే మన ఫోన్లలో సాఫ్ట్‌వేర్‌ కరప్ట్‌ అవుతుంది. దీంతో ఫోన్‌ హ్యాంగ్‌ అవడం, యాప్స్‌ వాడేటప్పుడు స్టక్‌ అవడం జరుగుతుంది. దీంతోపాటు మన సమాచారం హ్యాకర్లకు చేరుతుంది. ఈ క్రమంలోనే అలాంటి నకిలీ యాప్స్‌ను గూగుల్‌ ఈ మధ్యనే తొలగించింది. వాటి సంఖ్య కొన్ని లక్షల్లోనే ఉంది.

అయితే గూగుల్‌ సంస్థ తన ప్లే స్టోర్‌లో ఎన్ని యాప్స్‌ను తొలగించినప్పటికీ రోజు రోజుకీ నకిలీ యాప్స్‌ పుట్టుకొస్తూనే ఉన్నాయి. కనుక మనమే ఈ యాప్స్‌ పట్ల జాగ్రత్త వహించాలి. సదరు యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసేముందు ఒకసారి ఆ యాప్‌కు ఉన్న రేటింగ్‌ చూడాలి. 5 స్టార్స్‌కు 4 స్టార్స్ కన్నా తక్కువ రేటింగ్‌ ఉందంటే… ఆ యాప్‌ను కచ్చితంగా అనుమానించాలి. ఎందుకంటే నకిలీ యాప్స్‌కే ప్లే స్టోర్‌లో రేటింగ్స్‌ తక్కువగా ఉంటుంది. దీనికి తోడు అలాంటి యాప్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసే ముందు వాటికి ఉన్న రివ్యూలను చదవాలి. వాటిని గతంలో ఇన్‌స్టాల్‌ చేసుకున్న యూజర్లు రివ్యూ పెడతారు. దీంతో ఆ రివ్యూను చదివితే మనకు ఆ యాప్స్‌ నిజమైనవో, నకిలీవో ఇట్టే తెలిసిపోతుంది.

యాప్స్‌ నకిలీవో, అసలువో కనిపెట్టడం నిజానికి కొంత వరకు కష్టమే. కానీ పైన చెప్పిన విధంగా చేస్తే.. వాటిని కొంత వరకు ఇన్‌స్టాల్‌ చేసుకోకుండా జాగ్రత్త పడవచ్చు. ఇక గూగుల్‌ సంస్థ ఇటీవలే కొన్ని యాప్స్‌ను ప్లే స్టోర్‌ నుంచి తొలగించింది అని చెప్పాం కదా. మరి ఆ యాప్స్‌ ఏమిటో తెలుసా..? వాటిని కింద చూడండి…

Smart Swipe, Real Time Booster, File Transfer Pro, Network Guard, LED Flashlight, Voice Recorder Pro, Free Wifi Pro, Call recorder Pro, Call Recorder, Realtime Cleaner, Super Flashlight lite, Cool Flashlight, Master Wifi Key, WiFi Security Master – WiFi Analyzer, Speed Test, Source, Free WiFi Connect, Brightest LED Flashlight-almighty, Brightest Flashlight, Call Recording Manager, Smart Free WiFi, Brightest LED Flashlight-Pro, Dr. Clean Lite, Wallpaper HD – Background

ఈ యాప్స్‌ గనక మీ ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో ఉంటే ఇప్పుడే తొలగించండి. ఎందుకంటే వీటిని గూగుల్‌ తన ప్లే స్టోర్‌ నుంచి తొలగించింది. ఈ యాప్స్‌ అన్నీ మీ ఫోన్‌లో మీ సమాచారాన్ని దొంగిలిస్తాయి. మీ ఫోన్‌ను పని చేయకుండా చేస్తాయి. కనుక ఈ యాప్స్‌ను వెంటనే తీసేయండి. లేదంటే ఇబ్బందుల్లో పడతారు..!

Comments

comments

Share this post

scroll to top