సల్మాన్ ఖాన్ పై 250 కోట్ల కు పరువు నష్టం దావా!

సల్మాన్ ఖాన్ పై 250 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. విజయ్ గలానీ, ఈ విజయ్ గలానీ ఏవరో కాదు సల్మాన్ ఖాన్  తో వీర్ సినిమాను నిర్మించిన నిర్మాత. తనను మానసికంగా కుంగదీసాడని, తన పరువును మొత్తం బజారుకీడ్చాడని 250 కోట్ల పరువు నష్టం దావా ను సల్మాన్ పై  వేశాడు విజయ్.

salman-khan-film-veer

 

వీర్ సినిమాలో నటించడానికి సల్మాన్ కు 10 కోట్ల పారితోషకం ఇస్తానని ముందుగానే ఒప్పదం జరిగింది,  కానీ సినిమా బాగా హిట్ట్ అయితే  15 కోట్ల  వరకు  చెల్లిస్తామని అనుకున్నామని కానీ సినిమా సరిగ్గా ఆడలేదు . దీంతో సల్మాన్ కు  ఇవ్వాలనుకున్న ఆ 15 కోట్లు ఇవ్వలేదని, అయితే  సినిమా బాగా ఆడనప్పటికీ తనకు 15 కోట్లు ఇవ్వాల్సిందేనని సల్మాన్ కార్యాలయం నుండి ఒత్తిడులొచ్చాయని విజయ్ అన్నాడు.

wallpaper-of-the-movie-veer.jpg

Wallpaper of the movie Veer

ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా లో కూడా  సల్మాన్ తన  మీద పిర్యాదు చేశారని… మొత్తం ఈ ఎపిసోడ్ లో తన పరువు కు భంగం   వాటిల్లిందని  అందుకే అతని పై పరువు నష్టం దావా వేసినట్లు తెలిపాడు విజయ్ గిలానీ.ఇప్పుడిప్పుడే హిట్ అండ్ రన్ కేసులో కోలుకుంటున్న సల్మాన్ కు ఇదో తలనొప్పిగా మారిందిప్పుడు.

CLICK: టీమ్ ఇండియా ఓటమికి అసలు కారణాలు.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top