యాడ్ కోసం దీపిక పడుకొనే ను చంపేశారు!

పేస్ బుక్ అప్ డేట్స్ చూసుకుంటున్న ఓ వ్యక్తి ఓ పోస్ట్ చూసి  సడన్ గా షాక్ తిన్నాడు.  బ్యూటిఫుల్ నటి దీపిక పడుకొనే కార్ యాక్సిడెంట్ లో మరణించింది ,ఉదయం  9 గంటల 55 నిమిషాలకు ఈ ఘటన జరిగింది అని ఉంది ఆ పోస్ట్ లో…అసలే దీపిక పడుకొనే తన ఫేవరెట్ హీరోయిన్ తను మరణించిందనే పోస్ట్ చూసి తల్లాడిల్లిపోయాడు సదరు అభిమాని, అసలు డిటైల్స్ కోసం పోస్ట్ ను ఓపెన్  చేసి  చూసాడా అభిమాని, మంచి స్టైల్లో ఉన్న రెనాల్ట్ కార్స్ వస్తున్నాయ్, అయ్యో వీటిలో దీపిక కు యాక్సిడెంట్ అయ్యిందా అని అనుకుంటున్నాడు… కార్లు వచ్చాయి, పోయాయి… రెనాల్ట్ కార్స్ మీ దర్పానికి నిదర్శనం అనే యాడ్ కూడా వచ్చి పోయింది.

add renault car

మరి దీపికకు యాక్సిడెంట్ కావడం, చనిపోవడం ఆ వార్త ఏది అనుకుంటున్నాడు ఇంకా ఆ వ్యక్తి, తర్వాత తెలిసింది. రెనాల్డ్ యాడ్ చూడడానికి ఇలా దీపిక చనిపోయింది అనే పోస్ట్ ను ఎవరో  క్రియేట్ చేసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఇప్పుడు దీనిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. వారివారి ప్రచారం కోసం ఇలా సెలబ్రెటీలను చచ్చిపోయారు అని ప్రచారం చేయడం ఎంత వరకు సబబని.. సెలెబ్రీటీలు ప్రోడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండండం గురించి తెలుసు కానీ, సెలెబ్రిటీలను చంపేసి తమ బ్రాండ్ కు ప్రచారం చేసుకునే సంస్థలను చూసి ఏమనాలో అర్థం కాని పరిస్థితి..

Deepika Padukone

అయితే దీనిని రెనాల్ట్ కంపెనీ వాళ్ళు రూపొందించలేదు యాడ్స్ ప్రమోషన్ లో భాగంగా ఒక బ్లాగ్ వాళ్లు రూపొందిచి ప్రచారం చేశారట.

 

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top