రణ్ వీర్ ఆ విషయంలో చాలా లేట్ : దీపికా పదుకునే.!!

ఈ మధ్య బాలీవుడ్ స్టార్స్ ప్రేమించి పెళ్లిళ్లు చేసుకొని వారి వివాహ దంపత్యాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. స్టార్ హీరో రన్ వీర్ సింగ్ అందాల తార దీపికా పదుకునే పెళ్లి చాలా కాలం ప్రేమాయణం కొనసాగించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నాక రణ్ వీర్ సింగ్ కి లక్ బాగా కలిసొచ్చినట్టుంది. పెళ్లి తరువాత రణ్ వీర్ నటించిన పద్మావత్ మూవీ సూపర్ హిట్ అయ్యింది.

లేటెస్ట్ గా వచ్చిన సింబా మూవీ ఏకంగా 250 కోట్లను వసూళ్లు చేసింది ఈ సినిమా. సినిమాల విజయ పరంపర కొనసాగిస్తూ వస్తున్న రణ్ వీర్ కి దీపికా నుంచి ఓ చేదు అనుభవం ఎదురైంది. ఇటీవలే సినిమా అవార్డుల ఫంక్షన్ లో పాల్గొన్న దీపికా తన భర్తపై ఆశ్చర్యకరమైన కామెంట్లు చేసింది. రణ్ వీర్ లో మీకు నచ్చని విషయం ఏమైనా ఉందా అని కొందరు ప్రశ్నించగా, దీనికి స్పందించిన పదుకునే తన భర్త ప్రతి విషయంలో చాలా ఆలస్యం చేస్తాడని ఓ బాంబు పేల్చింది. రణ్ వీర్ స్నానం చేయాలంటే ఓ గంట సమయం తీసుకుంటాడట. ఇక రెడీ కావడానికి డ్రెస్సింగ్ టేబుల్ ముందు చాలా సేపు గడుపుతాడట. చివరికి బెడ్ మీదికి రావడానికి కూడా ఆలస్యం చేస్తాడని చిన్నగా చిరునవ్వు నవ్వుకుంటూ చెప్పింది ఈ హాట్ భామ. మొత్తానికి దీపికా పేల్చిన ఆలస్యం అనే బాంబుతో రణ్ వీర్ కొద్దిగా ఇబ్బంది పడ్డాడు కావచ్చు. మరో వైపు ఈ విషయంపై నెటిజన్లు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.

Comments

comments

Share this post

scroll to top