నువ్వా నేనా.. చెన్నైతో ఢిల్లీ ఢీ..!

ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ -12 టోర్న‌మెంట్‌లో ఆఖ‌రు అంకానికి విశాఖ‌తో తెర ప‌డ‌నుంది. అటు చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు అభిమానుల‌కు ..ఇటు ఢిల్లీ కేపిట‌ల్స్ జ‌ట్టు ఫ్యాన్స్ కు ఎక్క‌డ‌లేని ఎంజాయిమెంట్ వీరి మ్యాచ్ ద్వారా క‌ల‌గ‌నుంది. ఇరు జ‌ట్లు టోర్నీ హాట్ ఫెవ‌రేట్‌లుగా ఉన్నాయి. అన్నింటికంటే ఎక్కువ‌గా బెట్టింగ్ రాయుళ్లు ధోనీ సార‌థ్యం వ‌హిస్తున్న చెన్నైపైనే ఆశ‌లు పెట్టుకున్నారు. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు చుక్క‌లు చూపించి..బౌలింగ్‌లోను..బ్యాటింగ్ లోను రాణించి విజ‌యం సాధించిన ఢిల్లీ జ‌ట్టు మ‌రింత ప‌టిష్టంగా ఉంది. యంగ్ అండ్ డైన‌మిక్ బ్యాట్స్ మెన్ రిష‌బ్ పంత్ మంచి ఊపు మీదున్నాడు. బంతికి బ్యాట్ కు మధ్య ర‌స‌వ‌త్త‌ర పోరు మాత్రం జ‌రగ‌నుంది. ఎవ‌రికి వారే వ్యూహాలు ర‌చించడంలో నిమ‌గ్న‌మ‌య్యారు. ఆయా జ‌ట్ల కెప్టెన్లు ..ఆట‌గాళ్లు మైదానంలో ప్రాక్టీస్ ప్రారంభించారు. విశాఖ‌లో వాతావర‌ణం పొడిగా ఉంది. ఇప్ప‌టికే టికెట్ల‌న్నీ అయిపోయాయి. అభిమానులు ఎపుడెపుడా అంటూ ఎదురు చూస్తున్నారు.

తొలిసారిగా ఐపీఎల్ ఫైన‌ల్లో అడుగు పెట్టి..క‌ప్ ఎగ‌రేసుకు పోవాల‌న్న‌ది ఢిల్లీ జ‌ట్టు ఆశ‌. మూడు సార్లు ఛాంపియ‌న్ గా నిలిచి..నాల్గో సారి కూడా క‌ప్పును చేజిక్కించుకుని రికార్డు మోత మోగించాల‌ని చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు ఎదురు చూస్తోంది. ఆస‌క్తిక‌ర పోరుకు వేళైంది. ఏది ఏమైనా ఫైన‌ల్ పోరాటం ఆస‌క్తిని ..ఉత్కంఠ‌కు తెర లేప‌నుంది. అనుభ‌వం క‌లిగిన చెన్నై జ‌ట్టును విజ‌యం వ‌రిస్తుందా లేక కుర్రాళ్ల‌తో కూడిన ఢిల్లీ జ‌ట్టు గెలుపు సిద్ధిస్తుందా అన్న‌ది వేచి చూడాల్సిందే. చెన్నై జ‌ట్టు ముంబ‌యి ఇండియ‌న్స్ జ‌ట్టుతో అనూహ్యంగా ఓట‌మి పాలు కాగా ..స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టును అవ‌లీల‌గా ఓడించి ఢిల్లీ చెన్నైతో సై అంటూ రెడీ అయింది. టాప్ -2 ఫినిష‌ర్ గా ఫైన‌ల్ ఆడేందు కోసం మ‌రో ఛాన్స్ ద‌క్కించుకుంది చెన్నై జ‌ట్టు . లేక‌పోతే ఈపాటికే ఇంటికి వెళ్లి ఉండేది.

ఇరు జ‌ట్ల విష‌యానికి వ‌స్తే..ఐపీఎల్ టోర్నీలో చెన్నై ..ఢిల్లీ జ‌ట్టు 20 మ్యాచ్‌ల్లో త‌ల‌ప‌డ్డాయి. ఇందులో చెన్నై 14 సార్లు గెలుపొంద‌గా..ఢిల్లీ జ‌ట్టు కేవ‌లం ఆరు సార్లు మాత్రమే విజ‌యం సాధించింది. ఢిల్లీతో చెన్నై జ‌ట్టుదే పై చేయి సాధించింది. సూప‌ర్ ఫాంలో ఉన్న కెప్టెన్ ధోనీ చెన్నై జ‌ట్టు విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషించాడు. 13 మ్యాచ్‌లు ఆడిన ధోనీ 400 ప‌రుగులు చేశాడు. స‌గ‌టు రేటింగ్ 133 గా ఉంది. చెన్నై జ‌ట్టు గెలుపొందాలంటే ధోనీ త‌ప్ప‌క రాణించాల్సిన అవ‌స‌రం ఉన్న‌ది. రాయుడు ఉండ‌నే ఉన్నాడు. ఇక ఢిల్లీ జ‌ట్టులో రిష‌బ్ పంత్ ..నిల‌క‌డ‌గా నిల‌బ‌డితే ..ఢిల్లీ జ‌ట్టుకు విజ‌యం సాధించ‌డం సులువ‌వుతుంది. అత‌డొక్క‌డే అడ్డుగా నిల‌బ‌డి ఢిల్లీకి ఘ‌న‌మైన గెలుపును అందించాడు. చెన్నై జ‌ట్టు ఈ కుర్రాడి మీదే దృష్టి ఎక్కువ‌గా పెట్ట‌నుంది. 15 మ్యాచ్‌లు ఆడిన ఈ కుర్రాడు 450 ప‌రుగులు చేశాడు. చెన్నైకి షార్ట్ హిట్ట‌ర్‌గా ఉన్న వాట్స‌న్ ఫామ్‌లోకి రాక పోవడం ఆందోళ‌న క‌లిగిస్తోంది. డుప్లిసిస్, రైనా స‌త్తా చాటితేనే విజ‌యం వ‌రిస్తుంది. లేక‌పోతే క‌ష్ట‌మే. మొత్తం మీద ఇరు జ‌ట్లు ఢీ కొనేందుకు రెడీగా ఉన్నాయి.

Comments

comments

Share this post

scroll to top