ఫేస్బుక్ ప్రియుడి కోసం తల్లి ని చంపేసిన కూతురు.!!

ఈ మధ్య కాలం లో ఆన్ లైన్ లవ్ లు ఎక్కువయ్యాయి. 4 రోజులు చాట్ చేశామా, కలిసామా, నచ్చారా, ప్రేమ మొదలు అంటూ సాగుతుంది. అయితే ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ప్రేమలు ఇటీవల చాలా ఎక్కువయ్యాయి. తమిళనాడు లోని తిరువళ్లూరు లో ప్రేమ కు అడ్డొస్తుందని తల్లిని చంపేసింది ఓ కూతురు.

వివరాల్లోకెళితే.. తమిళనాడు లో తిరువళ్లూరు జిల్లా లోని కాక్కళూరుకు చెందిన దేవీప్రియ ఫేస్బుక్ లో ఒక వ్యక్తిని ప్రేమించింది. ఇద్దరు 6 నెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం దేవీప్రియ ఇంట్లో తెలియడం తో దేవీప్రియ ఇంట్లో నుండి పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇంట్లో నుండి డబ్బు, బంగారం తో పారిపోతుండగా దేవీప్రియ తల్లి దేవీప్రియ ను అడ్డుకుంది, దీంతో దేవీప్రియ కు సహాయం చెయ్యడానికి వచ్చిన వ్యక్తి దేవీప్రియ తల్లి పైన కత్తి తో దాడి చేసాడు, ఆమె గట్టిగ అరవడం తో చుట్టు పక్కల ఉన్న జనాలు వచ్చి నిందితుడిని పట్టుకొని పోలీసులకి అప్పగించారు. దేవీప్రియ తల్లి భానుమతి ని హాస్పిటల్ కి తరలించారు, చికిత్స సమయం లో ఆమె మరణించారు. దేవీప్రియ కు సాయం చేసిన వ్యక్తి పేరు వివేక్‌. తిరువిడై మరుదూరుకు చెందిన వివేక్‌ను ప్రేమిస్తున్నట్లు పోలీసులకు చెప్పింది దేవీప్రియ. వారి ఇరువురి చాటింగ్ చుసిన పోలీసులకు అనుమానం వచ్చింది, ఎందుకంటె వారి చాటింగ్ లో అనుమదాస్పద విషయాలు ఏవి లేవని పోలీసులు గ్రహించారు. ఆ తరువాత తమ స్టైల్ లో దేవీప్రియ ను అడిగారు పోలీసులు, అప్పుడు తాను ఎవర్ని ప్రేమించిందో చెప్పింది.

ఫేస్బుక్ లో దేవీప్రియ ప్రేమించిన అబ్బాయి పేరు సురేష్‌. రెడ్‌హిల్స్‌ ప్రాంతానికి చెందిన సురేష్‌ గతంలో ఆవడిలో పని చేసేవాడు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా సత్యవేడులోని శ్రీసిటిలోని నిప్పాన్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. సురేష్, దేవీప్రియ ప్రేమించుకొని 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలల్లో వారు 3 సార్లు కలుసుకున్నారు. దేవీప్రియ ఇంట్లో ప్రేమ వ్యవహారం బయట పడటం తో దేవీప్రియ తల్లి తండ్రులు దేవీప్రియను మందలించారు, ఇంట్లో నుండి పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు సురేష్, దేవీప్రియ. అందుకోసం సురేష్ ఫ్రెండ్ వివేక్, దేవీప్రియ ను ఇంట్లో నుండి తీసుకురాడానికి దేవీప్రియకు సహాయం చేసాడు, వివేక్ తో కలిసి అడ్డమొచ్చిన తల్లిని చంపేసింది దేవీప్రియ. సురేష్‌ను మంగళవారం శ్రీసిటీలో అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ నిమిత్తం సురేష్ ను తిరువళ్లూరు తీసుకెళ్లారు.

అబ్బాయిలతోనే కాదు, అమ్మాయిలతో కూడా జాగ్రత్తగా ఉండాలి.

అమ్మాయిలు #మీటూ అని గోల గోల చేస్తారు కానీ, అబ్బాయిలకు ఏ మాత్రం తీసిపోరు అని అమ్మాయిలు ఎప్పటికప్పుడు నిరూపిస్తున్నారు. అబ్బాయిలు అమ్మాయిలు అని కాదు, మనిషి తత్వమే అంత. ఏమంటే మనుషుల్లో అబ్బాయిలలో తప్పులు చేసి బయట పడే వారి సంఖ్య ఎక్కువ. అమ్మాయిలలో తప్పులు చేసి బయట పడే వారి సంఖ్య తక్కువ.

 

Comments

comments

Share this post

scroll to top