కూతురి ప్రసవాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలో చేయించిన కలెక్టర్.! ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకాన్ని పెంచిన IAS

ఆదర్శాలను వల్లించే వారికంటే ఆచరించిన వాళ్లు గొప్పవాళ్లు.. అలాంటి వాళ్లు చాలా తక్కువమంది ఉంటారు…వాల్లలో ఒకరు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి…కూతురుకి ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం చేయించారు… ఏదో ఒక పని చేసి వార్తల్లో ఉండడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది…కానీ పబ్లిసిటీ కోసం ఈ కలెక్టర్ గారు ఆ పని చేయలేదు..ఎందుకు చేయించారో తెలుసా…

ప్రభుత్వాసుపత్రులలో ప్రసవాలను ప్రోత్సహించాలని ‘’కాన్పునకు రా తల్లీ’’ అనే కార్యక్రమాన్ని చేపట్టారు జయశంకర్ జిల్లా కలెక్టర్ మురళి….దాని గురించి ప్రజలలో అవగాహన కల్పించాలని తాను చేపట్టిన కార్యక్రమం తనే అమలు చేసి చూపించారు…కూతురు ప్రగతిని హైదరాబాదునుండి భూపాలపల్లికి కాన్పునకు రా తల్లీ అని ఆహ్వానించారు..కార్పొరేట్ హాస్పటల్ లో కాకుండా గవర్నమెంటు హాస్పటల్ లో కూతురుకి ప్రసవం చేయించి అందరికీ ఆదర్శంగా నిలిచారు… ప్రగతికి ధైరాయిడ్ సమస్య ఉండడంతో నార్మల్ డెలివరీ కష్టం అనీ ఆపరేశన్ చేయాలని నిర్ణయించి సిజేరియన్ చేశారు డాక్టర్లు..రెండున్నర కిలోల బరువుతో పుట్టిన ఆడబిడ్డను ఎత్తుకున్న కలెక్టర్ ”నేను తాతనయ్యాను” అని మురిసిపోయారు…ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని సదుపాయాలు ఉంటాయని అందుకే నా కూతురుని  ఇక్కడికీ తీసుకొచ్చానని అన్నారు..

ప్రసవం అనేది పునర్జన్మ లాంటిది…డెలివరీ టైంలో భయం ఉండడం కామన్..ప్రభుత్వ ఆసుపత్రులలో రక్షణ ఉండదని చాలామంది ప్రైవేట్ హస్పటల్స్ కు వెళ్తాంటారు..కానీ ప్రైవేటు హస్పటల్లో ప్రసవం అయిన వాళ్లు వేలకు వేలు డబ్బు పోసామని దానికి తోడు నార్మల్ అవ్వాలని అనుకుంటే ఆఖరి నిమిషంలో ఏదో సమస్య చెప్పి సిజేరియన్ చేసారని చాలామంది వాపోతుంటారు… మనలో మన మాట ప్రభుత్వాసుపత్రికి వెళ్తే మన డబ్బులు సేఫ్ ..ఆరోగ్యం సేఫ్…

కలెక్టర్ గారూ హ్యాట్సాఫ్….

Comments

comments

Share this post

scroll to top