స్కూల్ ఫీజ్ క‌ట్ట‌లేక…కార్పెంట‌ర్ ప‌నిలో చేరిన దాస‌రి ! ద‌ర్శ‌క‌ర‌త్న గురించి మ‌న‌కు తెలియ‌ని కోణం.!!

దాస‌రి నారాయ‌ణ రావు…ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా, ర‌చ‌యిత‌గా మ‌నంద‌రికీ సుప‌రిచిత‌మే.!! ఎక్కువ సినిమాలు తీసిన ద‌ర్శ‌కుడిగా గిన్నిస్ బుక్ రికార్డ్స్ లోకి ఎక్కినా…. వ‌రుస‌గా 6 సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డుల‌ను ద‌క్కించుకున్నా….త‌న సినిమాల‌తో సామాజిక రుగ్మ‌త‌ల‌ను ప్ర‌శ్నించినా…అది ఆయ‌న‌కే చెల్లుతుంది. అయితే….ఇది మ‌నంద‌రికీ తెలిసిన విష‌య‌మే.! అయితే…. దాస‌రి గురించి మ‌న‌కు తెలియ‌ని కొన్ని విష‌యాలున్నాయి.! మూడు రూపాయ‌ల స్కూల్ ఫీజ్ క‌ట్ట‌లేక కార్పెంట‌ర్ ప‌నిలో చేరిన దాస‌రి ద‌ర్శ‌క ర‌త్నగా ఎదిగిన క్ర‌మం నిజంగా ఆద‌ర్శ‌నీయం.

పాల‌కొల్లులో దాస‌రి నాన్నా పెదనాన్నలు కలిసి పొగాకు వ్యాపారం చేసేవారు. ఒకసారి దీపావళి సమయంలో పొగాకు గోడౌన్‌ తగలబడిపోయింది. అప్పట్లో ఇన్సూరెన్సులు ఉండేవి కాదు. దాంతో ఆర్థికంగా చాలా దెబ్బతిన్నారు దాస‌రి కుటుంబం . ఆ కష్టకాలంలోనే పొలాలు కూడా అమ్మేయాల్సివచ్చింది.

వారి నాన్న తరం వరకూ మా కుటుంబంలో ఎవరూ చదువుకోలేదు. దాసరి వాళ్ళను మాత్రం చదివించారు వాళ్ళ నాన్న. దాసరి ఆరో తరగతి కొచ్చేసరికి వారి ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతింది. స్కూలు ఫీజు మూడుంపావలా కట్టడానికి కూడా డబ్బులేక ఆయన్ను బడి మాన్పించి ఒక వడ్రంగి దుకాణంలో పనిలో పెట్టారు. అక్కడ జీతం నెలకి రూపాయి.

ఆరో తరగతిలో ఉత్తమవిద్యార్థిగా ఆయనకు బహుమతి వచ్చింది. అలాంటిది చదువు మానేసి పనిలోకెళ్లాల్సిన దుస్థితి. కానీ ఒక మాస్టారు సాయంతో మళ్ళీ చదువు కొనసాగించాడు.

Comments

comments

Share this post

scroll to top