మా ఊరి ద‌స‌రా…ఒక్క‌వేటుకు గొర్రెబ‌లినిచ్చే సాంప్ర‌దాయం స్పెష‌ల్.!

అంద‌రి ఊర్లోలాగానే మా ఊర్లో కూడా ద‌స‌రా పండుగను చాలా ఘ‌నంగా జ‌రుపుకుంటాం.! పిండి వంట‌లు, కొత్త బ‌ట్ట‌లు, జ‌మ్మి అందించి అలాయ్ బ‌లాయ్ లు, పాల‌పిట్ట ద‌ర్శ‌నాలు ఇవ‌న్నీ కామ‌నే, కానీ మా ఊర్లో ద‌స‌రాకు ఓ స్పెష‌ల్ సీన్ ఉంటుంది. కేవ‌లం దానిని చూడ‌డం కోస‌మే ప‌ట్ట‌ణాలకు బ‌త‌క‌డానికి వల‌స వెళ్లిన వారు సైతం వ‌చ్చేస్తారు. ఆ తంతునంతా ప్ర‌త్య‌క్షంగా తిల‌కిస్తుంటారు. అదే ఒక్క దెబ్బ‌కు పొట్టేలు త‌ల‌ను ఖండించ‌డం.

బొడ్రాయి ద‌గ్గ‌ర పూజ అనంత‌రం…..పూజించిన క‌త్తిని చేత‌బ‌ట్టి…..ముదిరాజ్ వంశానికి చెందిన కుల‌పెద్ద‌…గొర్రె త‌ల మీద బ‌లంగా ఒక్క‌వేటు వేస్తాడు…ఆ ఒక్క వేటుకే పొట్టెలు త‌ల మొండెం నుండి వేర‌వుతుంది. డ‌ప్పుల మోత‌ల‌తో ఊరిజ‌నం బొడ్రాయి ద‌గ్గ‌రి నుండి కోట‌మైస‌మ్మ గుడివైపుగా క‌దులుతారు. అక్క‌డ ఇదే సీన్…అదే క‌త్తి .., అదే వేటు..ఇక్క‌డ మ‌రో పొట్టెలు అమ్మవారికి బ‌లి.! ఇలా ఈ బ‌లి కార్య‌క్ర‌మం చాలా ఉత్సాహంగా సాగుతుంది. ఊరి యూత్ అంతా అక్క‌డే…సెల్ ఫోన్ లో ఈ సీన్ ను బంధిస్తూ బిజీబిజీగా గ‌డిపేస్తారు.

ఇంత‌కీ ఈ సాంప్ర‌దాయం ఎక్క‌డిది?
పూర్వం మ‌హిషాసురుడు ( దున్న‌పోతు త‌ల క‌ల‌వాడు ) అనే రాక్ష‌సుడు జ‌నాల‌ను బాగా పీడించేవాడు. దీంతో దేవ‌త‌లంద‌రూ క‌లిసి ఆ రాక్ష‌సుడిని సంహ‌రించ‌డం కోసం దుర్గా దేవిని వేడుకుంటారు. అయితే దుర్గా దేవిని చూసిన మ‌హిషాసురుడు ఆమె అందానికి ముగ్దుడై ఆమెను పెళ్లి చేసుకోవాల‌ని కోరతాడు.దానికి దుర్గా దేవి త‌న‌తో యుద్ధం చేసి గెలిస్తేనే పెళ్లి చేసుకుంటాన‌ని ష‌ర‌తు పెడుతుంది. దీంతో మ‌హిషాసురుడు దుర్గాదేవితో యుద్ధం చేస్తాడు. అది 9 రోజులు సాగుతుంది. చివ‌ర‌కు 9వ రోజున దుర్గాదేవి మ‌హిషాసురుడి త‌ల న‌రుకుతుంది. దీంతో ప్ర‌జ‌లు సంబురాలు చేసుకుంటారు. ఆ 9 వ రోజునే మ‌నం ద‌స‌రా అని జ‌రుపుకుంటాం.! దున్న‌పోతు త‌ల మాదిరిగా ఉన్న మ‌హిషాసురుడి త‌ల‌ను దేవి న‌రుకుతుంది కాబ‌ట్టి అప్ప‌టి నుండి మ‌న దేశంలోని కొన్ని ప్రాంతాల్లో దున్న‌పోతుల త‌ల‌ల‌ను ఒక్క వేటుతో న‌రికి వాటిని దుర్గా దేవికి స‌మ‌ర్పించే ఆచారం కొన‌సాగుతుంది. ఇటీవ‌ల కాలంలో దున్న‌పోతుల స్థానంలో పొట్టెల‌ను బ‌లిచ్చి, అలా బ‌లిచ్చిన పొట్టెలు మాంసాన్ని తినే ఆచారం కొన‌సాగుతుంది.

Comments

comments

Share this post

scroll to top